ఓపెన్‌ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీలో ప్రకటనలు రాబోతున్నాయని ఇటీవల సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాంతో ఓపెన్‌ఏఐ అధికారికంగా స్పందించింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి చాట్‌జీపీటీ యాప్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ నిక్ టర్లీ రంగంలోకి దిగి స్పష్టతనిచ్చారు.
ఇటీవలి వారాల్లో చాట్‌జీపీటీ సంభాషణల్లో యాడ్ ప్యానెళ్లు కనిపిస్తున్నాయని కొందరు వినియోగదారులు పేర్కొంటూ, స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీటిని ఖండిస్తూ నిక్ టర్లీ ఎక్స్‌లో లో ఒక పోస్ట్ చేశారు. ‘చాట్‌జీపీటీలో ప్రకటనల పుకార్ల గురించి చాలా వార్తాలొస్తున్నాయి. వీటిని నమ్మొద్దు. ఎలాంటి ప్రకటన టెస్ట్‌లు కంపెనీ నిర్వహించలేదు. మీరు చూసిన స్క్రీన్ షాట్‌లు నిజమైనవి కావు’ అని చెప్పారు.
ఇదీ చదవండి: ఎస్‌బీఐ ఉద్యోగులకు జాక్‌పాట్
🚨 OpenAI has denied the rumors of testing advertisements inside its popular AI chatbot, ChatGPT. pic.twitter.com/vbs3vH8krz
— Indian Tech & Infra (@IndianTechGuide) December 7, 2025


