
MumbaiDreams చిన్న వయసులోనే కేవలం రూ.500తో ముంబైకి వచ్చాడు. దాదాపు 34 ఏళ్ల పోరాటం.ఎన్నో కష్టాలు మరెన్నో చేదు అనుభవాలు. కానీ మంచిరోజులు తప్పక వస్తాయని తనపై నమ్మకం పెట్టుకున్నాడు. కట్ చేస్తే సూపర్ స్టార్ అయ్యాడు. పట్టుదల, సహనం ఆయనని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. కష్టాలు, సుఖాలు వెలుగు నీడల్లాంటివే వస్తాయ్..పోతాయ్.. కానీ మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. దృఢ నిశ్చయంగా గమ్యం వైపు సాగిపోవాలి అని నిరూపించిన నటుడు, రాజకీయ నాయకుడి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందామా..!
రేసుగుర్రం’తో తెలుగు వారికి పరిచయమైన నటుడు రవీంద్ర కిషన్ శుక్లా(Ravi Kishan Shukla) (జననం 1969, జూలై 17న సంప్రదాయాలు, కట్టుబాట్లతో నిండిన ఒక పూజారి ఇంట్లో పుట్టాడు. కానీ చిన్నప్పటినుంచి నాటకాలంటే ఇష్టం. చిన్నతనంలోనే రామ్ లీలాలో సీత పాత్రలో నటించాడు. ఇది తండ్రి బాగా మందలించాడు. చఅంతే 17 ఏళ్ల ప్రాయంలో 500 రూపాయలు చేతబట్టుకొని ముంబైకి పారిపోయాడు. అదే అతని జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ముంబై లాంటి మహానగరంలో ఆయన జీవన పోరాటంలో ఎన్నో కష్టాలు. దివింది 12వ తరగతే...అయినా సరే. ఈ భూమ్మీద తన నకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఆశతోనే ముందుగా సాగాడు. కట్ చేస్తేప్రస్తుతం గోరఖ్‌పూర్ నుండి పార్లమెంటు, లోక్‌సభ సభ్యునిగా పనిచేస్తున్నారు.అతను పార్లమెంటరీ విధులలో తన పనితీరుకు 2025లో సంసద్ రత్న అవార్డును అందుకున్నాడు.
1992లో విడుదలైన బాలీవుడ్ చిత్రం పితాంబర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. తన తొలి సినిమాతో రూ.5000 సంపాదించాడు. హిందీ, తెలుగు, తమిళం,కన్నడ చిత్రాలలో నటించినప్పటికీ భోజ్‌పురి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2003లో వచ్చిన సయ్యా హమార్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతే అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేడు. స్టార్‌గా రాణించాడు. బిగ్ బాస్ 1 తో పేరు తెచ్చుకున్నాడు. హాలీవుడ్ చిత్రానికి మొట్టమొదటిసారిగా భోజ్‌పురిలో స్పైడర్ మ్యాన్ 3కి డబ్బింగ్ కూడా చేశాడు. అయితే నటుడిగా ఉండాలంటే చాలా భ్రమల్లో ఉండేవాట. పాలతో స్నానం.. గులాబీ రేకులపై నిద్రపోవడం.. వంటివి చేసేవాడినని, అయితే అలవాట్ల కారణంగా తాను ఓ సినిమాలో అవకాశం కోల్పోయానని చెప్పుకొచ్చారు. ఇలా గెలుపోటముల నుంచి నేర్చుకుంటూ, పడుతూ లేస్తూ తానేంటో నిరూపించుకున్నాడు రవికిషన్.
1993లో ప్రీతి శుక్లాను వివాహం చేసుకున్న రవి కిషన్ నలుగురు పిల్లల(ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు )తండ్రి. ముక్కాబాజ్, బాట్లా హౌస్ , లాపతా లేడీస్ - నుండి మామ్లా లీగల్ హై వంటి OTT హిట్‌ల వరకు.. ఎన్నో మైలు రాళ్లు ఆయన జీవితంలో ఉన్నాయి.
రవి కిషన్ నికర విలువ: పలు మీడియా నివేదికల ప్రకారం రవికిషన్‌కు రూ.14.96 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. దాదాపు రూ.20.70 కోట్ల విలువైన స్థిరాస్తులు కూడా ఉన్నాయి. దీంతోపాటు కోట్ల రూపాయల విలువైన 11 ఫ్లాట్లు ఉన్నాయి. భార్య ప్రీతి శుక్లా పేరుతో రూ.4.25 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. దీనితో పాటు రూ.9.38 లక్షల విలువైన బంగారం కూడా ఉన్నట్టు సమాచారం. ఇక కోట్ల విలువ చేసే టయోటా ఇన్నోవా, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ మరియు BMW వంటి లగ్జరీ కార్లున్నాయి.