ఎన్నో స్ఫూర్తిని కలిగించే సక్సెస్ స్టోరీలను చూసుంటారు. అయితే వాటిలో..ఎన్నో వైఫల్యాల తర్వాత విజయాన్ని చవిచూసిన వారు కొందరైతే..తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నవారు మరికొందరు. అలా కాకుండా మన స్నేహితులంతా సెటిల్ అవుతూ హ్యాపీగా ఉంటే..మనం మాత్రం ఓటమితో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటే..మళ్లీ ప్రయత్నించాలన్నా బాధకంటే..మనమే ఎందుకు ఓడిపోతున్నాం అనే బాధ ఎక్కువుగా ఉంటుంది. కానీ ఇతడు వాళ్లతో నార్మల్‌గా వ్యవహరిస్తూ..యథావిధిగా తన ప్రయత్నం సాగించి..వారికంటే స్పెషల్ అనిపించుకునేలా అందనంత స్థాయిలో సెటిల్ అయ్యాడు. వైఫల్యాలను హ్యాండిల్ చేయడం అంటే ఇది బ్రో అని చెబుతున్నాడు అతడు. నెట్టింట తెగ వైరల్‌గా మారింది అతడి సక్సెస్ స్టోరీ.
అతడే ఫ్లట్టర్ యువర్ వే వ్యవస్థాపకుడు కార్తీకే సింగ్. తన స్టోరీని సోషల్ మీడియాలో ఎక్స్‌లో షేర్ చేసుకున్నాడు. వింటే కచ్చితంగా వాటే సక్సెస్ స్టోరీ అంటారు. 16 ఏళ్ల వయసులో ఐఐటీలో అడ్మిషన్ పొందాలనుకున్నాడు. అది మిస్. సర్తే 20 ఏళ్లకే మంచి జాబ్ కొట్టేద్దామనుకున్నాడు..అది కూడా ఫెయిల్. స్నేహితులంతా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో సెలక్ట్ అయిపోతుంటే..కార్తీక్‌కి మాత్రం రిజెక్ట్‌లే ఎదురయ్యేవి. మెక్రోసాఫ్ట్ నుంచి ఆటోడెస్క్ వరకు అన్ని నో చెప్పాయి.
హాస్టల్ రూమ్‌లో స్నేహితులంతా జాబ్ కొట్టేశామన్న ఆనందంతో పార్టీలు చేసుకుంటే..తాను మాత్రం బెడ్‌పై పడుకుని..వందోసారి జాబ్ పోర్టల్స్ రిఫ్రెష్ చేస్తున్నా అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు కార్తీక్. అనుకోకుండా ఒక రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లోఒక ఫ్రీలాన్సర్‌ని చూశాడు. ఆన్‌లైన్‌లో పనిచేస్తూ..స్థిరమైన ఆదాయం అందుకుంటున్న ఒక సాధారణ వ్యక్తిని చూసి..అతడితో సంభాషించాడు. అదే అతడి జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది.
కార్తీక్ అతడిలా ప్రతిరోజూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. కానీ ఎటువంటి ప్రతిస్పందన, లైక్‌లు, సందేశాలు రాలేదు. దాదాపు ఆరు వారాల తర్వాత నాకు సహాయం చేయగలరా అనే మెసేజ్ వచ్చింది. ఇది అతని తొలి ప్రాజెక్ట్. అందుకు అతనికి రూ. 3000 వేతనం పొందాడు. ఆ ప్రారంభ ప్రాజెక్ట్ క్రమంగా పెరిగింది. అలా క్లయింట్లురావడం ప్రారంభించారు, ప్రాజెక్టులు రేట్లు పెరిగాయి. చివిరకి ఒక ఐదుగురు వ్యక్తులతో కూడిన ఏజెన్సీని నడుపుతూ నెలకు దాదాపు రూ. 6 లక్షల మేర ఆదాయం అందుకుంటున్నాడు.
ఇన్ని వైఫల్యాలు చూసిన తానే ఇంతలా సక్సెస్‌ని అందుకుంటే..మీరు కూడా కచ్చితంగా సాధించగలుగుతారు అని పోస్ట్‌ని ముగించాడు. ఈ పోస్ట్ నెటిజన్ల మనసులను తాకడమే కాదు..కార్తీక్ చేసిన ప్రయత్నాలకు ప్రశంసిస్తూ..ఏమి చేయలేని పరిస్థితిలో కూడా సానూకూల దృక్పథం, ఆశను వదులకోకూడదని చెబుతున్న మీ స్టోరీ చాలా స్ఫూర్తిని రగిలిస్తోందని అని పోస్టులు పెట్టారు.
At 16, all I wanted was IIT.
Didn't happen.
At 20, all I wanted was a job offer.
That didn't happen either.
Microsoft said no.
Autodesk said no.
Everyone said no.
Lying on my hostel bed, watching my friends celebrate placements while I refreshed job portals for the 100th time.…— kartikey singh (@askwhykartik) October 26, 2025
(చదవండి: ఆ దేశానికి ఎయిర్‌పోర్ట్, సొంత కరెన్సీ లేవు..కానీ వరల్డ్‌లోనే అత్యంత ధనిక దేశం..)


