ఒక దేశ సామర్థ్యాన్ని సైనికబలం, ఆర్థిక స్వాతంత్య్రం వంటివాటిని కొలమానంగా చేసుకుని అంచనా వేస్తారు. ప్రధానంగా చూసేవి వాటినే. కానీ ఈ దేశానికి అవేమి లేకపోయినా..సుసంపన్నమైన దేశంగా కీర్తిగడిస్తుంది, పైగా ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా పేరు గడిస్తోంది. ఒక దేశం గొప్పతనాన్ని తెలిపే, అంతర్జాతీయ విమానాశ్రయం , సొంత కరెన్సీ లేని ఈ దేశం ఎలా అత్యంత ధనిక దేశం పేరు గడించిందో తెలిస్తే విస్తుపోతారు. ప్రతిదీ సృష్టించి భుజాలు ఎగరువేయడం కాదు..పరిమిత వనరులనే ఉత్తమంగా ఉపయోగించుకుంటే.. అత్యంత సంపన్న దేశంగా అవతరించొచ్చని చాటిచెబుతోంది ఈ దేశం.
ఆ దేశమే చిన్న యూరోపియన్ దేశం లీక్టెన్‌స్టీన్(Liechtenstein). ప్రపంచంలోని అత్యంత స్థిరమైన సంపన్నదేశాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ దేశం సొంత కరెన్సీని కూడా ముంద్రించదు, పైగా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు. మరి సంపన్న దేశంగా ఎలా పేరుగడిస్తోందంటే..
చాలా దేశాలు తమ సార్వభౌమాధికార చిహ్నాలైనా..కరెన్సీ, భాష, జాతీయ విమానాయన సంస్థ వంటి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాయి. కానీ లీక్టెన్‌స్టీన్ అందుకు విరుద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. అప్పుతో కూడా సమర్థవంగా నిర్ణయించొచ్చని ప్రూవ్ చేస్తూ..స్విస్ ఫ్రాంక్‌ని అధికారిక కరెన్సీగా స్వీకరించింది.
దాంతోనే బలమైన స్థిరమైన ఆర్థిక నిర్మాణానికి అంకురార్పణ వేసింది. ఫలితంగా కేంద్రబ్యాంకు అవసరం, కరెన్సీ నిర్వహణ భారం పడకుండా చేసుకుంది. అదేవిధంగా ఎయిర్‌పోర్టుల బదులుగా స్విట్జర్లాండ్, ఆస్ట్రియా రవాణా నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని, బిలియన్ల డాలర్లను ఆదా చేస్తోంది.
అదే ఈ దేశం బలం..
పరిశ్రమ, ఆవిష్కరణలే ఈ దేశం బలాలు. దంత వైద్యంలో ఉపయోగించే మైక్రో-డ్రిల్‌ల నుంచి ఏరోస్పేస్ టెక్నాలజీ, ఆటోమొబైల్ బాగాల వరకు ప్రతిదాన్ని ఉత్పత్తి చేస్తూ ఇంజీనీరింగ్ పరికరాల ఉత్పత్తిలలో అగ్రగామిగా రాజ్యమేలుతోంది. అంతేగాదు నిర్మాణ పరికరాల్లో ప్రపంచ నాయకుడైన హిల్టి ఆ దేశ పారిశ్రామిక బలానికి ప్రధాన చిహ్నం.
ఇక్కడ చాలామటుకు రిజిస్టర్డ్ కంపెనీలే ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే..జనాభా కంటే రిజిస్టర్డ్ సంస్థలే చాలా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ నిరుద్యోగం అనేదే కనిపించదు. అదీగాక పౌరుల ఆదాయాలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. అంటే పేదవాడనే వాడే ఉండడు. ఇక్కడ జనాభా కూడా అత్యంత తక్కువే కేవలం 40 వేల మందే.
రుణ, నేర రహిత దేశం..
ఈ దేశంలో దాదాపు అప్పులనేవి ఉండవు, ప్రభుత్వ ఆదాయంలోని మిగులుతూనే దేశాన్ని నడిపిస్తుంది. మరో విశేషం ఏంటంటే..ఇక్కడ కొద్దిమంది ఖైదీలే ఉంటారట. అంతేగాదు ఈ దేశంలోని పౌరులు రాత్రిళ్లు ఇళ్లకు తాళలు కూడా వేయరట.
ఇది ఆదేశ భద్రదా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తేటతెల్లం చేస్తోంది. పైగా ఇలా నిర్భయంగా బతకడంలోనే అసలైన జీవితం ఉందని ఈ ఆ దేశం తన చేతలతో నిరూపిస్తోంది. ఈ దేశం కేవలం సంపదకు చిహ్నం మాత్రమే కాదు, అత్యున్నత స్థాయి, భద్రత, శాంతి వంటి వాటికి చిరునామా అని కీర్తిస్తున్నారు పలువురు.
(చదవండి: ‘విలేజ్ హాలోవీన్ పరేడ్’కి వెళ్లాలంటే..గట్స్ ఉండాలి..!)


