breaking news
Liechtenstein
-
మనతో పాటు ఆ నాలుగు...
నేడు మనం 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనతో పాటు కాంగో, కొరియా, బహ్రెయిన్, లీచ్టెన్స్టెయిన్ దేశాలకు సైతం పరాయిదేశ పాలన నుంచి స్వాతంత్య్రం సిద్ధించింది. పాకిస్తాన్ భారత్‌కన్నా ఒక రోజు ముందు ఆగస్టు 14నే స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కొరియా ఆగస్టు 15ని నేషనల్ లిబరేషన్ డే ఆఫ్ కొరియాగా జరుపుకుంటోంది. 1945, ఆగస్టు 15న జపాన్ అధీనంలోని కొరియా ద్వీప కల్పం నుంచి అమెరికా, సోవియట్ యూనియన్ బలగాలను విరమించుకున్నాయి. నార్త్, సౌత్ కొరియాల రెండింటికీ కామన్ పబ్లిక్ హాలిడే ఆగస్టు 15. మూడేళ్ల అనంతరం కొరియా.. ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. ఇక 1971, ఆగస్టు 15న బహ్రెయిన్ బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం పొందింది. కాంగో 18 దశాబ్దాల పాటు ఫ్రాన్స్ ఆధిపత్యంలో కొనసాగిన తరువాత 1960, ఆగస్టు 15న సంపూర్ణ స్వాతంత్య్రం పొందింది. ప్రపంచంలోనే ఆరవ అతి చిన్న దేశం లిచిన్స్టెయిన్. జెర్మనీ పాలన నుంచి 1866, ఆగస్టు 15న విముక్తి పొందింది. ఆగస్టు 16 లిచిన్స్టెయిన్ రాజు రెండవ ఫ్రాంజ్ జోసెఫ్ పుట్టిన రోజు కావడంతో 1940 నుంచి ఆగస్టు 16ని స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటోంది. -
నల్లధనం గుట్టు విప్పనున్న లీక్టెన్‌స్టీన్
న్యూఢిల్లీ: పన్నులు ఎగవేసి కూడబెట్టిన అక్రమ సంపదను ఇతర దేశాల్లో దాచుకుంటున్న వారి గుట్టుమట్లు తెలుసుకునే కృషిలో భారత్ మరో ముందడుగు వేయనుంది. తమ దేశంలోని బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల సమాచారాన్ని వెల్లడించేందుకు లీక్టెన్‌స్టీన్ దేశం ఎట్టకేలకు అంగీకరించింది. దీంతో, లీక్టెన్‌స్టీన్ నుంచి ఈ సమాచారం పొందడానికి భారత ప్రభుత్వం దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే కొలిక్కిరానున్నాయి. పన్ను ఎగవేతను అరికట్టడం, నల్లధనం వివరాలను వెల్లడించడంపై అంతర్జాతీయ ఒడంబడికపై సంతకం చేయడానికి లీక్టెన్‌స్టీన్ అంగీకరించిందని ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) వెల్లడించింది. ఈ నెల 21, 22 తేదీల్లో జకార్తా(ఇండోనేసియా)లో జరగనున్న అంతర్జాతీయ సమావేశంలో లీక్టెన్‌స్టీన్ ఈ ఒడంబడికపై సంతకం చేయనుంది. పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓఈసీడీ పర్యవేక్షణలో ఈ ఒడంబడిక అమలవుతోంది.