
‘స్క్రాప్ టు స్ట్రక్చర్’ నినాదంతో వేస్ట్ మేనేజ్‌మెంట్ సెక్టార్‌లోకి అడుగుపెట్టిన ప్లానెక్స్ రీసైకిలింగ్’ (plannex recycling) కంపెనీ వినూత్న ఆవిష్కరణలకు పెద్ద పీట వేసింది. ‘వెదికితేనే కదా... దారి తెలిసేది’ అంటున్న ప్లానెక్స్ కో–ఫౌండర్ ఇషిత బన్సాల్ ( Ishita Bansal) ఎప్పటికప్పుడు సరికొత్త లక్ష్యాలతో ముందుకు వెళుతోంది.
వ్యాపార కుటుంబంలో పుట్టిన ఇషితకు వాణిజ్య విషయాలు కొట్టిన పిండి. పాఠశాల విద్య పూర్తయిన తరువాత దుబాయ్‌లోని ‘అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ దుబాయ్’లో చేరి ఇంటర్నేషనల్ బిజినెస్‌లో డిగ్రీ చేసింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత తమ కుటుంబ ఆధ్వర్యంలోని ‘ఇన్‌టెక్స్ టెక్నాలజీస్’లో చేరింది. ఇక్కడ పనిచేస్తున్న కాలంలోనే ఇ–వేస్ట్ గురించి ఆలోచించింది. ఈ సమస్య గురించి లోతుగా అధ్యయనం చేసింది. ఆ తరువాత యశ్‌రాజ్ భరద్వాజ్, యువరాజ్, హర్షి గిలర్‌లతో కలిసి దిల్లీ కేంద్రంగా ప్లానెక్స్ రీసైకిలింగ్’ మొదలుపెట్టింది.
చదవండి: ఒకప్పటి సెక్యూరిటీ గార్డే .. ఇపుడు మైగేట్ యాప్ సీఈవో!
మైక్రో–రీసైకిలింగ్ యూనిట్‌లను వికేంద్రీకరించడం ద్వారా కంపెనీ కొత్త అడుగు వేసింది. చెత్త సేకరించే కార్మికులకు గౌరవప్రదమైన ఉపాధిని అందించడంతో పాటు వారి ఆరోగ్య విషయాలపై దృష్టి పెట్టింది. వారి కోసం నైపుణ్య అభివృద్ధి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది ప్లానెక్స్ ఈ సంవత్సరం 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చదవండి: Antidepressants మహిళలు సేఫే, బట్ పురుషులకే!