
నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధంతో శాంతియుతంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం ఉగ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. బయటిశక్తుల విధ్వంసకర ఉద్యమ ఎగబోతతో నివురుగప్పిన నిప్పులా తయారై తాత్కాలిక ప్రభుత్వానికి కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. దాంతో సైన్యంరంగంలోకి దిగి దేశవ్యాప్త కర్ఫ్యూను కఠినంగా అమలుచేస్తోంది. ఈ క్రమంలో నేపాల్ బిలియనీర్ ఉపేంద్రమహతో నివాసంపై జనరేషన్-జెడ్ (Gen-Z) యువత దాడి చేసి, లూటీ చేసి, ధ్వంసం చేశారనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నేపాల్‌లోని మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా గుర్తింపు పొందిన ఉపేంద్ర మహతో ఇంటిపై దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడి జరిగినప్పుడు మహతో రష్యాలోని మాస్కోలో ఉన్నారని స్థానిక మీడియా చెబుతోంది. మరో వైపు, అనేక వ్యాపార సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకున్న ఆందోళనకారులు.. పగటిపూట ఒక సూపర్ మార్కెట్‌ను పురుషులు, మహిళలు లూటీ చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చేతికి ఆరో వేలుగా అతుక్కుపోయిన స్మార్ట్‌ఫోన్‌లో సోషల్ మీడియా యాప్స్ అనేవి ఓ రకంగా ఆత్మ వంటివి. అలాంటి ఆత్మను చంపేస్తామంటూ ఊరుకోబోమంటూ తెలియజేప్పేందుకే శాంతియుత నిరనస ర్యాలీలు చేపట్టామని నేపాల్‌లోని జెన్ జెడ్ యువత చెబుతోంది. దేశాన్ని చీడపీడలా తొలిచేస్తున్న అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవనాన్ని ప్రశ్నించేందుకు కదం తొక్కామని, మూడ్రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని జెన్ జెడ్ విద్యార్థులు, యువజన సంఘాలు స్పష్టంచేశాయి. రాజకీయ అవకాశవాదులు ఉద్యమకారుల మాటున నిరసనకార్యక్రమాల్లో దూరిపోయి నేపాల్‌ను అగ్నిగుండంలా మార్చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
Nepal protests:
After attack on political leader Robbery & arson at businessman Upendra Mahato's house too pic.twitter.com/yT6UbGNRaY— Raghvendra Mishra राघवेंद्र मिश्र (@Raghvendram14) September 10, 2025