
భారతదేశంలో అమ్ముడవుతున్న మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారు నేపాల్‌లో లాంచ్ అయ్యాయి. NAIMA నేపాల్ మొబిలిటీ ఎక్స్‌పోలో కనిపించిన BE 6 ధర NR 57 లక్షలు (రూ. 35.66 లక్షలు), XEV 9e ధర దాదాపు NR 69 లక్షలు (రూ. 41 లక్షలు).
సరికొత్త డిజైన్ కలిగిన మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. లెవల్ 2+ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, పెట్ మోడ్‌తో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, రికార్డర్ ఫంక్షన్‌తో 360-డిగ్రీ కెమెరా, డాల్బీ అట్మోస్‌తో 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్ప్లే వంటి ఫీచర్స్ పొందుతాయి.
ఇదీ చదవండి: 75 దేశాల్లో కోటి మంది కొన్నారు: ధర కూడా తక్కువే..
XEV 9e మూడు స్క్రీన్‌లతో వైడ్‌స్క్రీన్ డిస్‌ప్లే పొందుతుంది. BE 6 వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. XEV 9e మరియు BE 6 లు 59 kWh మరియు పెద్ద 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. XEV 9e రేంజ్ 542 కి.మీ (59 kWh) & 656 కి.మీ (79 kWh). BE 6 రేంజ్ 535 కి.మీ (59 kWh) & 682 కి.మీ 79 kWh.