
దక్షిణాసియా అండర్–19 పురుషుల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–0 గోల్స్ తేడాతో నేపాల్ జట్టును ఓడించి గ్రూప్ ‘టాపర్’గా నిలిచి సెమీఫైనల్‌కు అర్హత పొందింది.
భారత్ తరఫున చాపామాయుమ్ రోహెన్ సింగ్ (28వ, 76వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ఒమంగ్ డోడుమ్ (29వ నిమిషంలో), డానీ మీటీ (84వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఈనెల 16న జరిగే సెమీఫైనల్లో మాల్దీవులు జట్టుతో భారత్ తలపడుతుంది.