
నేపాల్, థాయ్‌లాండ్ జట్లు ఆఖరి నిమిషంలో మహిళల టీ20 వరల్డ్‌కప్-2026 గ్లోబల్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ రెండు జట్లు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పోటీ పడేందుకు అర్హత సాధించాయి. తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో యూఏఈపై విజయాలు సాధించిన నేపాల్, థాయ్‌లాండ్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి.
గ్లోబల్ క్వాలిఫయర్స్‌కు ఇదివరకే స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లు అర్హత సాధించాయి. యూరప్, ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి అర్హత సాధించే జట్లేవో తెలియాల్సి ఉంది. ఈ రెండు టోర్నీల నుంచి రెండు జట్లు వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం గ్లోబల్ క్వాలిఫయర్స్‌లో ఆరు జట్లు పోటీ పడి, నాలుగు జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి.
కాగా, 2026 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఇంగ్లండ్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడతాయి. ఆతిధ్య దేశ హోదాలో ఇంగ్లండ్ తొలుత ఈ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు బెర్త్‌లు గ్లోబల్ క్వాలిఫయర్స్ ద్వారా డిసైడ్ అవుతాయి. ఈ టోర్నీలో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.