
సాక్షి, విశాఖపట్నం: నేపాల్‌లో చెలరేగిన అల్లర్లలో ఉత్తరాంధ్ర వాసులు చిక్కుకుపోయారు. ఈ నెల 3న విహారయాత్రకు 81 మంది బృందం బయలుదేరింది. అందులో 70 మంది విశాఖ వాసులు కాగా, మిగతా 11 మంది శ్రీకాకుళం, విజయనగరం వాసులు.
ఖాట్మండులో రాయల్ కుసుమ్ హోటల్‌లో బిక్కుబిక్కుమంటూ యాత్రికులు కాలం గడుపుతూ తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. గత రెండు రోజులుగా కర్ఫ్యూ విధించడంతో ఎటు కదలని లేని స్థితిలో యాత్రికులు చిక్కుకుపోయారు. కాగా, నేపాల్‌లో చిక్కుకున్న బాధిత మహిళ ఆడియో వైరల్‌గా మారింది.
