
కాఠ్మండు: నేపాల్ ఆపద్ధర్మ ప్రధానిగా ఇటీవల నియమితులైన సుశీలా కర్కి గురువారం ప్రధాని మోదీతో ఫోన్‌లో సంభాషించారు. ప్రాధాన్యతాంశాలను అమలు చేయడంలో ఆపద్ధర్మ ప్రభుత్వానికి తోడ్పాటునిస్తామని ఆమెకు మోదీ హామీ ఇచ్చారు. బాధ్యతలు చేపట్టాక కర్కి ఒక విదేశీ ప్రభుత్వాధినేతకు చేసిన మొట్టమొదటి ఫోన్ కాల్ ఇదే కావడం గమనార్హం.
సామాజిక మాధ్య మాలపై నిషేధంతోపాటు ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా యువత ఆధ్వర్యంలో జరిగిన జెన్ జడ్ నిరసనలు హింసాత్మక రూపం దాల్చడంతో ప్రధాని కేపీ శర్మ ఓలి గద్దెదిగగా, కర్కి ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్య తలు చేపట్టడం తెల్సిందే. గురువారం ఫోన్ కాల్ సందర్భంగా నేపాల్‌కు మొట్టమొదటి మహిళా ప్రధాని గా బాధ్యతలు చేపట్టిన కర్కికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారని విదేశాంగ శాఖ తెలిపింది. ఎన్నికల నిర్వహణే తమ ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉంటుందని కర్కి తెలిపారు.