breaking news
interim Prime Minister
-
నేపాల్‌లో మార్చి 5న ఎన్నికలు
కాఠ్మండు: సామాజిక మాధ్యమాలపై నిషేధం, అవినీతి, వారసత్వరాజకీయాలతో పెల్లుబికిన ప్రజాగ్రహం ధాటికి దగ్దమైన పార్లమెంట్, సుప్రీంకోర్టు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపర్వం పరిసమాప్తి తర్వాత ఎట్టకేలకు పూర్తికాల ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులుపడ్డాయి. వచ్చే ఏడాది మార్చి నెల ఐదో తేదీన పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ శనివారం ప్రకటన చేశారు. ‘‘ దేశం అత్యంత క్లిష్టమైన, భయానక దశను చవిచూసింది. ఇప్పుడు అంతా సద్దుమణిగింది. రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థలే మనల్ని కాపాడాయి. సమైక్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ముందుకు సాగుదాం. ఆరు నెలల్లోపు పార్లమెంట్ దిగువసభకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించుకుని ప్రగతిశీల ప్రజాస్వామ్య పథంలో పయనించే అవకాశాన్ని ప్రజలకు కలి్పస్తున్నాం. సుస్థిరపాలనే లక్ష్యంగా తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం మార్చి ఐదో తేదీన ఎన్నికలు నిర్వహించబోతున్నాం. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలి. విపక్ష పార్టీలు మొదలు విద్యారి్థలోకం, పౌరసమాజం అంతా ఈ ఎన్నికల క్రతువుకు తమ వంతు సాయం అందించాలి’’ అని శనివారం విడుదలచేసిన ఒక ప్రకటనలో అధ్యక్షుడు పౌడెల్ కోరారు. శుక్రవారం దేశ తాత్కాలిక మహిళా ప్రధానిగా పగ్గాలు చేపట్టిన వెంటనే సుశీల కర్కీ చేసిన సిఫార్సు మేరకు పార్లమెంట్‌ను రద్దుచేశారు. అవినీతి మురికికూపంలో పొర్లాడుతున్న ప్రభుత్వంపై విద్యార్థుల్లో గూడుకట్టుకున్న ఆగ్రహం.. హఠాత్తుగా సోషల్‌మీడియా యాప్‌ల నిషేధంతో కట్టలుతెంచుకున్న విషయం విదితమే. 24 శాఖలు ఆమె వద్దే ఆదివారం ప్రధా«ని కర్కీ తన తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. శనివారం కర్ఫ్యూ ఎత్తివేశాక దేశవ్యాప్తంగా తాజా శాంతిభద్రతల పరిస్థితిపై ఆమె సమీక్ష జరిపే వీలుంది. పలువురు మంత్రులతో ఆమె దేశ, విదేశాంగ విధానాలపై చర్చించే అవకాశముంది. హోం శాఖ, విదేశీ వ్యవహారాలు, రక్షణశాఖ వంటి కీలక 24 శాఖలను ఆమె తన వద్దే అట్టిపెట్టుకోనున్నట్లు సమాచారం. కాఠ్మండులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలుండే సింగ్‌దర్బార్ కాంప్లెక్స్‌లో కొత్తగా నిర్మించిన హోం మంత్రిత్వ శాఖ భవనాన్ని ప్రస్తుతానికి ప్రధాని కార్యాలయంగా మార్చనున్నారు. ప్రధాని కార్యాలయాన్ని ఇటీవల ఆందోళనల్లో విద్యార్థి నిరసనకారులు తగలబెట్టడంతో కొత్త భవనంలోకి ఆఫీస్‌ను మార్చాల్సి వస్తోంది. మరోవైపు హింసాత్మక ఘటనల్లో గాయపడిన వారిని ప్రధాని పరామర్శించారు. కాఠ్మండులోని బనేశ్వర్‌లోని పౌర ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులతో ఆమె స్వయంగా మాట్లాడారు. తగు సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పార్లమెంట్ ప్రస్తుత కాలపరిమితిని రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాలన్న అధ్యక్షుడు నిర్ణయాన్ని ప్రధాన రాజకీయపార్టీలన్నీ తప్పుబట్టాయి. నేపాల్కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(మావోయిస్ట్ సెంటర్)లు ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. రాజ్యాంగ విరుద్ధంగా కాలావధిని కాలరాయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నాయి. ఈ మేరకు దిగువసభలోని పార్టీల చీఫ్ విప్‌లు ఒక సంయుక్త ప్రకటనను విడుదలచేశాయి. దేశాధ్యక్షుడి చర్యలను తప్పుబట్టాయి.జస్టిస్ సుశీలకు మోదీ అభినందనలు ఇంఫాల్: నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సుశీల కరీ్కకి భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అభినందనలు తెలియజేశారు. ఆమె నియామకం మహిళా సాధికారతకు ఉజ్వలమైన ఉదాహరణ అని ప్రశంసించారు. మోదీ శనివారం మణిపూర్ సభలో మాట్లాడుతూ.. భారత్–నేపాల్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇరుదేశాలు చరిత్ర, విశ్వాసం, సాంస్కృతి సంబంధాలను పంచుకుంటున్నాయని వివరించారు. -
వెరవని వ్యక్తిత్వం
సంక్షుభిత సమయంలో ఒక జాతి తమను నడిపే నేతగా ఒక స్త్రీ వైపు చూడటం అరుదు. నేపాల్‌లో ఇప్పుడు అక్కడి యువత అలాంటి ఒక స్త్రీ వైపు చూస్తోంది. అక్కడ ఏర్పడబోతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఉంటే బాగుంటుందని ఆశిస్తోంది. ఆమె ఆర్మీ చీఫ్‌ను కలిశారు కూడా! భారతదేశంలో చదువుకుని, టీచర్ స్థాయి నుంచి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి వరకూ ఎదిగిన సుశీలా కర్కీది వెరవని వ్యక్తిత్వం. ఆమె రచయిత కూడా. వివరాలు...‘ఇండియా– నేపాల్ దేశాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలది. ప్రభుత్వాలు వాటి వాటి విధానాల వల్ల పని చేస్తుండొచ్చు. కాని ఇరుదేశాల ప్రజలు ఏనాటి నుంచో స్నేహంగా ఉన్నారు. ప్రధాని మోదీపై నాకు మంచి అభి్రపాయం ఉంది. మా స్నేహితులు, బంధువులు ఎందరో ఇండియాలో ఉన్నారు. మావారు ఎక్కువ కాలం ఇండియాలోనే గడిపారు. భారతీయులు నేపాలీలను ఆదరిస్తూనే ఉన్నారు’ అన్నారు సుశీలా కర్కి.73 ఏళ్ల ఈ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేపాల్‌లో ఏర్పడనున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఖరారయ్యాయి. నేపాల్‌లో ఉద్యమం కొనసాగిస్తున్న జెన్ జి విద్యార్థుల బృందం తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుశీలా కర్కి మా ఎంపిక అని తేల్చి చెప్పింది. సుశీలా కర్కి తన సోషల్ మీడియా అకౌంట్లో ‘దేశ పరిస్థితుల రీత్యా నాకు అప్పజెప్పే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలియచేశారు.‘నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా హాస్టల్ నుంచి నిత్యం పారే గంగను చూసే దాన్ని. ఎండాకాలం హాస్టల్ టెర్రస్ మీద పడుకునేవారం. ఉదయాన్నే గంగను చూసేవారం. అక్కడ నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, పాఠాలు చెప్పిన గురువులు ఇంకా స్పష్టంగా గుర్తున్నారు’ అన్నారామె. ‘మా ఊరు విరాట్‌నగర్ నుంచి భారత్ సరిహద్దు 25 మైళ్లు ఉంటుంది. మేము తరచూ బోర్డర్ మార్కెట్‌కు వెళ్లేవాళ్లం. నాకు హిందీ వచ్చు’ అని తెలిపారామె.ప్రభుత్వంలో అవినీతి, మంత్రుల పట్ల వ్యతిరేకత, నయా సంపన్నుల వైఖరి, సోషల్ మీడియాపై నిర్బంధం... వీటన్నింటి దరిమిలా నేపాల్‌లో యువతరం తెచ్చిన తిరుగుబాటు వల్ల నాయకత్వ మార్పు స్పష్టమైంది. సుశీలా కర్కి ఆపద్ధర్మ ప్రధాని అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటు చేయించి తప్పుకోవడమే ఆమె ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతకు ఆమె సమర్థురాలని యువత భావిస్తోంది.టీచర్‌గా మొదలైసుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా ఆ దేశవాసుల్లో గుర్తింపు, గౌరవం పొందారు. జూన్ 7, 1952న నేపాల్‌లోని శంకర్‌పూర్‌కు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన కర్కి ఏడుగురు పిల్లలలో మొదటి సంతానం. 1972లో బిరాట్నగర్లోని మహేంద్ర మొరాంగ్ క్యాంపస్ నుండి బీఏ డిగ్రీ చేసి మన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రం చదివారు. అక్కడ చదువుతున్న సమయంలోనే నేపాలీ కాంగ్రెస్ సభ్యుడు, యువజన విభాగ నాయకుడు దుర్గా ప్రసాద్ సుబేదిని కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 1979లో కార్కి బిరాట్‌నగర్‌లో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985లో ధరణ్‌లోని మహేంద్ర మల్టిపుల్ క్యాంపస్‌లో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేశారు. 2007లో సీనియర్ అడ్వకేట్‌గా 2009లో ఆ దేశ సుప్రీంకోర్టులో అడ్–హాక్ జస్టిస్‌గా నియమితులయ్యారు. నవంబర్ 18, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏప్రిల్ నుండి 2016 జూలై వరకు నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2017 జూన్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.రచయితగా...కర్కి 2018లో ‘న్యాయ’ పేరుతో తన ఆత్మకథ రాశారు. 2019 డిసెంబర్లో ‘కారా’ అనే నవల ప్రచురించారు. నేపాల్‌లో 1960 నుంచి 90ల మధ్యకాలంలో రాజు కనుసన్నల్లో సాగిన ‘పంచాయత్’ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అనుభవాలను ఆమె తన రచనల్లో ఉటంకించారు. ఆపద్ధర్మ అధినేతగా తన ఎంపిక జరిగితే శాంతి నెలకొల్పడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం తన తొలి ప్రాధాన్యం అని ఆమె అన్నారు.సుశీలా కర్కిది వెరవని వ్యక్తిత్వం అని అందరూ అంటారు. ఆమె న్యాయనిపుణత, అవినీతి రహిత నేపథ్యం చాలా కేసుల్లో కీలకమైన తీర్పులు ఇచ్చేలా చేసింది. ఒక అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించడానికి సైతం ఆమె వెనుకాడలేదు. ఇవన్నీ ఆమెకు సానుకూలంగా మారాయని చర్చ సాగుతోంది. ఆ పేరు బయటకు వచ్చాక నేపాల్‌లో ముఖ్యంగా ఖాట్మండులో శాంతి నెలకొనడం ఆమె మాటకు విలువ ఉంటుందనడానికి ఉదాహరణ.గమనిక: ఈ కథనం రాసే సమయానికి సుశీలా కర్కితోపాటు మరికొన్ని పేర్లు కూడా ఆపద్ధర్మ ప్రధాని పదవికి పరిశీలనలోకి వచ్చాయి. -
నేపాల్ ప్రధానిగా సుశీల?
కాఠ్మండు: కల్లోల నేపాల్‌లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువతరం ఆరంభించిన పోరాటం నేపాల్ ప్రధానమంత్రి కేపీ వర్మ ఓలీ రాజీనామాకు దారితీసింది. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ‘జనరేషన్ జెడ్’ఆన్లైన్లో సంప్రదింపులు ప్రారంభించింది. యువత తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కీని తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించాలని చాలామంది సూచిస్తున్నారు. యువతలో ఆమెపట్ల అమితమైన ఆదరణ కనిపిస్తోంది. తాజాగా జరిగిన వర్చువల్ సమావేశంలో 5 వేల మందికిపైగా పాల్గొన్నారు. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా జస్టిస్ సుశీల కర్కీని నియమించాలన్న ప్రతిపాదనకు ఎక్కువమంది ఓటేశారు. తొలుత కాఠ్మండు నగర మేయర్ బాలెన్ షా పేరు వినిపించింది. అయనను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అందుబాటులోకి రాలేదని జనరేషన్ జెడ్ ప్రతినిధులు చెప్పారు. మరోవైపు కర్కీకి మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది. మద్దతుగా 2,500 మంది సంతకాలు మధ్యంతర ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలంటూ సుశీల కర్కీని యువత అభ్యర్థించగా.. తనకు మద్దతుగా కనీసం వెయ్యి సంతకాలు సేకరించి, చూపించాలని ఆమె కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు అనుకూలంగా సంతకాలు చేసినవారి సంఖ్య 2,500కు చేరినట్లు సమాచారం. మరోవైపు పోటీలో సుశీల కర్కీ ముందంజలో ఉన్నప్పటికీ మరికొన్ని పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చీఫ్ కుల్మాన్ ఘీసింగ్, యువనేత సాగర్ ధాకల్, ధరణ్ సిటీ మేయర్ హర్కా సంపంగ్ పేర్లపైనా చర్చ సాగుతోంది. నేపాల్‌లోని ప్రముఖ యూట్యూబర్ రందోమ్ నేపాలీ పేరు కూడా వినిపిస్తోంది. అయితే, మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపించడానికి ఎవరూ మందుకు రాకపోతే తాను ఆలోచిస్తానని ఆయన పేర్కొన్నారు. సుశీల కర్కీ నియామకానికి పెద్ద తతంగమే ఉంటుందని సమాచారం. ఆమె తొలుత నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ను, అనంతరం అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ను కలుసుకొని మద్దతు పొందాల్సి ఉంటుందని నిపుణులు చెప్పారు.ఎవరీ జస్టిస్ సుశీల? నేపాల్ చరిత్రలో 72 ఏళ్ల సుశీల కర్కీకి ప్రత్యేక స్థానమే ఉంది. సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డుకెక్కారు. భారత్‌లోని బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. 1975లో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. సుశీల కర్కీ మొదట టీచర్‌గా పనిచేశారు. 1978లో కాఠ్మండులోని త్రిభువన్ యూనివర్సిటీలో న్యాయ విద్యలో బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని రాజ్యాంగ మండలి సిపార్సు మేరకు అప్పటి అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ఆమెను చీఫ్ జస్టిస్‌గా నియమించారు. సుశీల కర్కీ అవినీతికి దూరంగా ఉంటారని, ఎవరికీ భయపడబోరని పేరుంది. అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపిస్తూ కీలక తీర్పులిచ్చారు. 2006లో నేపాల్ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా సేవలందించారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో చదుకున్నప్పటి రోజులను సుశీల ఇటీవలే గుర్తుచేసుకున్నారు. అక్కడ డ్యాన్స్ నేర్చుకొనే అవకాశం దక్కిందని చెప్పారు. ఆ యూనివర్సిటీలోనే తనకు ఉద్యోగం వచి్చందని, అక్కడే పీహెచ్డీ పూర్తిచేసే అవకాశం వచ్చిందని అన్నారు. కానీ, విధిరాత మరోలా ఉండడంతో న్యాయమూర్తిగా మారానని తెలిపారు.మోదీజీ కో నమస్కార్ నేపాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీక రించడానికి తాను సిద్ధంగా ఉన్నానని జస్టిస్ సుశీల చెప్పారు. ఆమె బుధవారం ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మధ్యంతర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలంటూ యువత చేసిన విజ్ఞప్తిని స్వీకరిస్తున్నానని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని నేపాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన ప్రారంభానికి శ్రీకారం చుడదామని అన్నారు. భారత్–నేపాల్ మధ్య దశాబ్దాలుగా బలమైన సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ అంటే తమకు ఎంతో గౌరవం, ప్రేమ అని స్పష్టంచేశారు. తమ దేశానికి భారత్ వివిధ సందర్భాల్లో ఎంతగానో సాయం అందించిందని చెప్పారు. భారతదేశ పాలకులు, నాయకులతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి నమస్కారాలు తెలియజేస్తున్నానని జస్టిస్ సుశీల కర్కీ వ్యాఖ్యానించారు. మోదీజీ అంటే తనకు గౌరవ ప్రప త్తులు, ఆరాధనభావం ఉన్నట్లు వివరించారు. -
పీఓకేను ఖాళీ చేయండి: భారత్ అల్టిమేటమ్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్తాన్‌కు భారత్ ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. పాక్ దురాక్రమణలో ఉన్న కశ్మీర్లో భూభాగాలను ఖాళీ చేయాలని, పాక్ గడ్డపైనున్న ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయాలని గట్టిగా చెప్పింది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 78వ సర్వప్రతినిధి సమావేశాల్లో పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో భారత్ గట్టిగా కౌంటర్ ఇచి్చంది. భారత్‌తో పాకిస్తాన్ శాంతిని కోరుకుంటోందని, రెండు దేశాల మధ్య శాంతి స్థాపన జరగాలంటే కశ్మీర్ అంశమే కీలకమని కాకర్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో భారత ఫస్ట్ సెక్రటరీ అయిన పెటల్ గెహ్లోత్ ఈ సమావేశంలో మాట్లాడారు. కాకర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. భారత్‌పై నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారంతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేయడం పాక్‌కు ఒక అలవాటుగా మారిందని ఆమె అన్నారు. పాకిస్తాన్లో మానవ హక్కుల హననం నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చడానికే కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారని మండిపడ్డారు. ‘‘జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని మేము పదే పదే చెబుతున్నాం. మా అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే హక్కు పాక్‌కు లేదు’’అని ఆమె గట్టిగా చెప్పారు. దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే పాకిస్తాన్ మూడు పనులు చేయాలని ఆమె సూచించారు. ‘‘మొదటిది సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలి, ఉగ్రవాద శిబిరాలను వెంటనే ధ్వంసం చేయాలి. రెండోది చట్టవిరుద్ధంగా, దురాక్రమణ చేసి ఆక్రమించుకున్న భారత్ భూభాగాలను (పాక్ ఆక్రమిత కశ్మీర్)ను ఖాళీ చేసి వెళ్లిపోవాలి. ఇక మూడోది. పాకిస్తాన్లో మైనారీ్టలైన హిందువుల హక్కుల ఉల్లంఘనను అరికట్టాలి. ’’అని గెహ్లోత్ తీవ్ర స్వరంతో చెప్పారు. భారత్‌ను వేలెత్తి చూపించడానికి ముందు పాక్ తన దేశంలో మైనారీ్ట, మహిళల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. -
పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా ఇషాఖ్ దార్!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రి ఇషాఖ్ దార్ (73) పేరు తెరపైకి వచి్చంది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ పదవీ కాలం ఆగస్టు 14న ముగియనుంది. కానీ 8వ తేదీనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా ఆదివారం వెల్లడించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ఇషాఖ్ దార్‌ను ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగిస్తారని తెలియజేసింది. ఆయన పేరును అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ పార్టీ ప్రతిపాదించింది. పాక్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పుల కోసం, విదేశాల నుంచి పెట్టుబడుల కోసం ప్రయతి్నస్తోంది. రుణాలు, పెట్టుబడులతో ఆర్థికంగా కుదురుకోవడానికి చాలా సమయం పట్టనుంది. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు షరీఫ్ ప్రభుత్వం ఇష్టపడడంలేదు. అందుకే ఆపద్ధర్మ ప్రభుత్వంతో నెట్టుకురావాలని భావిస్తోంది. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అసెంబ్లీ పదవీ కాలం పూర్తయితే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, జాతీయ అసెంబ్లీని పదవీ కాలం ముగియక ముందే రద్దు చేస్తే 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించవచ్చు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే దాకా ఆపద్ధర్మ ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తారు. ఆపద్ధర్మ ప్రధానిగా ఇషాఖ్ దార్ నియామకంపై పాకిస్తాన్ ప్రభుత్వం వచ్చేవారం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
మహింద ఔట్!
కొలంబో: ప్రతిపాదిత మధ్యంతర ప్రభుత్వంలో సోదరుడు మహిందా రాజపక్సను ప్రధాని పదవి నుంచి తొలగించడానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స శుక్రవారం అంగీకరించారు. కొత్త ప్రధానిని, అన్ని పార్టీలతో కూడిన నూతన మంత్రివర్గాన్ని ఎంపిక చేయడానికి జాతీయ కౌన్సిల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారని మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చెప్పారు. కానీ మహిందాను తప్పించాలన్న ఉద్దేశాన్ని గొటబయ వ్యక్తం చేయలేదని ఆయన అధికార ప్రతినిధి అన్నారు. 90 శాతం వద్దంటున్నారు మహింద రాజీనామా చేయాలని శ్రీలంకలో 89.7 శాతం మంది కోరుకుంటున్నారని తాజా సర్వేలో తేలింది. రాజపక్సల కుటుంబం రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని 89.9 శాతం మంది డిమాండ్ చేస్తున్నారు. గొటబయా కూడా దిగిపోవాలని 87.3 శాతం, ఎంపీలంతా తప్పుకోవాలని 55 శాతం జనం అంటున్నారు. -
ఆపద్ధర్మ ప్రధానిగా పెట్రోలియం మంత్రి
తెరపైకి షాహిద్ అబ్బాసీ.. షరీఫ్ తమ్ముడికే పూర్తికాలపు ప్రధాని పదవి ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పెట్రోలియం, సహజ వనరులశాఖ మంత్రి షాహిద్ ఖాకన్ అబ్బాసి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ శనివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో అబ్బాసీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. పనామా పత్రాల్లో తన కుటుంబసభ్యుల పేర్లు ఉండటంతో నవాజ్ షరీఫ్‌పై చట్టసభ సభ్యుడిగా పాక్ సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పాక్ తాత్కాలిక ప్రధానిగా అబ్బాసి 45 రోజులు సేవలు అందించనున్నారని, ఈ లోపు పార్లమెంటుకు పోటీచేసి.. నవాజ్ షరీఫ్ సోదరుడు, పంజాబ్ సీఎం షెహ్బాజ్ షరీఫ్ ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధమవుతారని అధికార పీఎంఎల్ఎన్ వర్గాలు తెలిపాయి. నవాజ్‌పై అనర్హత వేటు నేపథ్యంలో ఆయన వారసుడిగా సోదరుడు షెహ్బాజ్ ఎన్నికకు పీఎంఎల్ఎన్ మెజారిటీ నేతలు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. షరీఫ్ సంతానానికి విదేశాల్లో అక్రమ కంపెనీలు ఉన్నాయని 2015లో వెలుగుచూసిన పనామా పత్రాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన జిట్ నివేదిక మేరకు.. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవాజ్‌పై అనర్హత వేటువేస్తూ ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.