breaking news
manas sarovar
-
నేపాల్‌లో భీకర విషాదం.. సురక్షితంగా తెలుగు యాత్రికులు
టిబెట్: పవిత్ర మానస సరోవర్ యాత్ర నిమిత్తం నేపాల్ పర్యటనకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులంతా దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఒక హోటల్లో సురక్షితంగా ఆశ్రయం పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన ఈ యాత్రికులందరూ ప్రాణాపాయం లేకుండా పూర్తి సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది.అయితే, నేపాల్ ప్రకృతి ప్రకోపానికి సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బతినడంతో రాజధాని కాఠ్మాండ్కు చేరుకోవడంలో యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు యాత్రికుల వీసాలన్నీ ట్రావెల్ ఏజెన్సీల వద్దే ఉండిపోవడంతో స్వస్థలాలకు తిరిగి రావడంలో స్వల్ప జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఈ యాత్రికులంతా సెప్టెంబర్ 1వ తేదీన భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యాత్రికులు స్వల్ప ఆందోళనకు గురవుతున్నప్పటికీ, వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు, ట్రావెల్ ఆపరేటర్లు ధృవీకరించారు. యాత్రికులను త్వరగా సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న హిమాలయాల్లో, సముద్ర మట్టానికి సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర ప్రాంతం వద్దే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస పర్వతం ఉంది. ఈ యాత్రకు సాధారణంగా భారత్ లేదా నేపాల్ మీదుగా టిబెట్‌లోకి ప్రవేశిస్తుంటారు. నేపాల్ రాజధాని కాఠ్మాండ్ నుంచి రోడ్డు లేదా వాయు మార్గాల ద్వారా యాత్రికులు ఇక్కడికి చేరుకుంటారు. -
భూతల 'కైలాసం'
సాంస్కృతిక ప్రాముఖ్యత.. ప్రకృతి సోయగాలు.. భక్తిపారవశ్యంతో మునిగితేలేటి చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం.. అడుగడుగనా అద్భుతమైన అనుభూతులు..ఇవన్నీ కలిస్తే కైలాస మానససరోవర్యాత్ర. హిందువులు ప్రముఖంగా సందర్శించే తీర్థయాత్ర స్థలాల్లో ఇది ఒకటి. ఈ యాత్ర చేపట్టే ప్రయాణికులకు దారి వెంబడి అందమైన హిమగిరులు, స్వచ్ఛమైన జలపాతాలు కనువిందు చేస్తూ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. భారత్ నుంచి కైలాసమానసయాత్ర చేపట్టే ప్రయాణికులు సులువుగా కైలాసపర్వతం చేరేందుకు వీలుగా.. చైనా తన భూభాగంలోని నాథులా పాస్‌ను తెరిచింది. ఈ నేపథ్యంలో కైలాస సరోవర్ యాత్ర, ప్రాముఖ్యత, ఇతర విశేషాలు తెలుసుకుందాం. సాక్షి, స్కూల్‌ఎడిషన్: మానవససరోవర యాత్ర ఒక అద్భుతం. కైలాస పర్వతం, మానససరోవ సరస్సును సందర్శించేందుకు ఈ యాత్ర చేపడుతారు. ఈ రెండూ చైనా అధీనంలోని టిబెట్‌లో ఉన్నాయి. ఇది హిందు, బౌద్ధ, జైన మతాలకు పవిత్ర స్థలం. హిందు మతం ప్రకారం శివుడు ఈ పర్వత శిఖరంపై థ్యానస్థితిలో ఉంటాడని నమ్మకం. మానస సరోవరం ఒడ్డున హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. కర్నాలి, బ్రహ్మపుత్ర, సట్లేజ్, సింధూ నదులకు ఇది జన్మస్థలం. మానససరోవరం పడమటి వైపు రక్షస్తలి సరస్సు, ఉత్తరం వైపు కైలాస శిఖరం ఉంది. ప్రపంచంలో కెల్లా ఎత్తై ప్రదేశంలో ఉన్న ఈ సరస్సులో సాన్నం చేసినా, నీరు తాగినా పాపాలు పోతాయన్న భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉదయం 3 నుంచి5 గంటల మధ్య బ్రహ్మి ముహూర్తంలో బోలాశంకరుడు ఈ సరస్సులో స్నానమాచరిస్తాడని భక్తుల నమ్మకం. భారత్, నేపాల్‌తోపాటు అనేక దేశాల్లోని హిందువులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తుంటారు. మానస సరోవరానికి సమీపంలో కొలువుతీరిన ముక్తినాథ్ వద్ద 108 జలపాతాలు ప్రత్యేక్ష ఆకర్షణగా నిలుస్తాయి. ప్రపంచలో అతంత ఎత్తై ఎవరెస్ట్ శిఖిరంతో సహా, అనేక పర్వతాలను వీక్షించటం గొప్పఅనుభూతి. ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం తమకు కలుగుతుందని భక్తుల నమ్మకం. ఎన్నో విశిష్టతలతో ఇమిడి ఉన్న ఈ హిమాలయ పర్వతశ్రేణుల్లో మానవ మేధసుసకు సైతం అంతకుపట్టని ఎన్నో విషయాలు దాగున్నానయనే భావన ఈ యాత్ర ద్వారా కలుగుతుంది. యాత్ర విశేషాలు.. కైలాస మానససరోవర్ యాత్రను భారత విదేశాంగశాఖ నిర్వహిస్తుంది. ప్రతి ఏటా జూన్, సెప్టెంబర్ మధ్యలో ఈ యాత్రకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఈ యాత్రలో భాగంగా సముద్రమట్టం కన్నా 20 వేల కి.మీ ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుంది. శారీరంకంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ యాత్ర చేపట్టాంటే కచ్చితంగా భారతీయ పాస్‌పోర్టు కలిగి ఉండాలి. పురాతన కాలంలో అనేక మార్గాల్లో భక్తులు కైలాస పర్వతాన్ని చేరుకునేవారు. అయిన్పటికీ భారతప్రభుత్వం రెండు నిర్దేశిత మార్గాల్లో కైలాస పర్వతానికి భక్తులను పంపిస్తోంది. అందులో ఒకటి భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉత్తరాఖండ్ నుంచి లిపులేక్ పాస్ ద్వారా టిబెట్‌కు చేరే మార్గం ఇది. ఇంకో మార్గం నేపాల్ నుంచి ఉంది. ఇటీవలే చైనా ప్రభుత్వం సిక్కిం సరిహద్దుల్లోని నాథులా పాస్ తెరవటంతో ఈ యాత్రకు మూడో మార్గం సుగమైంది. నేపాల్ ద్వారా.. అనేక ట్రావెల్ ఏజెన్సీలు నేపాల్ రాజధాని కఠ్మాం డూ నుంచి మానససరోవర యాత్రకు ప్రయాణికులను తీసుకెళుతుంటారు. భారత్‌లోలాగా ప్రయాణీకుల సంఖ్యకు నిర్దిష్ట పరిమితంటూ ఏమీ లేదు. కార్లు, ఇతర వాహనాలు ద్వారా టిబె ట్ పీఠభూమి గుండా కైలాస పర్వతం బేస్ క్యాం పు తీసుకెళ్తారు. ఈ రూటు ద్వారా కైలాస పర్వతా న్ని చేరుకోవాలంటే 16 రోజుల సమయం పడుతుంది. సుమారు రూ.80000 ఖర్చు అవుతుంది. చైనా గుండా.. 50 ఏళ్ల తరువాత చైనా మానసరోవర్ యాత్ర చేపట్టే ప్రయాణికుల కోసం నాథులాపాస్ను ఇటీవలే తెరిచింది. ఇది సముద్రమట్టం కంటే 4వేల మీటర్ల ఎత్తులోఉంది. సిక్కిం-టిబెట్ సరిహద్దులో ఉండే ఈ కనుమ ద్వారా భారత్ నుంచి 50 మంది ప్రయాణికులు జూన్ 16న ఈ యాత్రకు బయలుదేరారు. ఈ సీజన్లో ఈ కనుమ గుండా ఐదు బ్యాచ్‌లుగా 250 మందిని యాత్రకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది సెప్టెంబర్ 18న భారత్-చైనాలు కుదర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ మార్గాన్ని చైనా ప్రభుత్వం తెరిచింది. నాథులా కనుమ ఒకప్పటి సిల్క్‌రూట్‌లో భాగంగా ఉండేది. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ నుంచి 54 కి.మీ దూరంలో ఉంది. 1962 భారత్-చైనా యుద్ధం తరువాత ఈ మార్గాన్ని చైనా మూసేసింది. భారతదేశం నుంచి.. భారత్ నుంచి కైలాస పర్వతాన్ని చేరుకునుందుకు ప్రభ్వుతమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆరోగ్యం, ఆసక్తి ఉన్నవాళ్లు యాత్రకు అప్లై చేసుకోవచ్చు. నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే ఈ యాత్రకు తీసుకెళుతారు. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో దీనికి సంబంధించి ప్రకటన వెలువడుతుంది. ఎంపికైన యాత్రికులకు మే నాటికి సమాచారం అందుతుంది. ఎంపికైన వారిని బ్యాచ్‌లుగా విభజిస్తారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య బ్యాచ్‌లుగా ప్రభుత్వం యాత్రికులను పంపిస్తుంది. ఇందుకు సుమారు రూ.50000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇండియా సరిహద్దులోఉన్నంత వరకు ప్రభుత్వమే యాత్రికులకు భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. ఈ రూట్లో ఎక్కువభాగం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. హెల్త్చెకప్ తరువాత ఢిల్లీ నుంచి ధార్చులా వరకు వాహనాల్లో తీసుకెళ్లారు. అక్కడ నుంచి పర్వతారోహణ చేయాల్సి ఉంటుంది. కైలాస పర్వతం, మానససరోవరాన్ని చేరుకున్న తరువాత అక్కడ 7 రోజులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అక్కడ యాత్రికులే స్వయంగా వంట చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాత్ర మొత్తం 30 రోజలు. కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ శిఖరాన్ని చేరాలంటే ఈ మార్గం అనుకూలమైంది.


