
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో గణపతి హోమం చేసేందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్ సతీమణి శోభతో కలిసి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పూజలో పాల్గొననున్నారు. అయితే, ప్రతీఏటా వినాయక చవతి నవరాత్రుల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తారు. అందులో భాగంగానే హోమం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఐదు రోజులుగా ఫాంహౌస్‌లోనే ఉన్నారు. ఆయన కూడా ఈ పూజలో పాల్గొననున్నట్టు సమాచారం.