హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి కేసీఆర్, హరీష్‌రావులను ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలని తెలంగాణ బీజేపీ నేతల్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 11లోపు కేసీఆర్, హరీష్‌లను అరెస్ట్‌చేయాలని డిమాండ్ చేశారు.
తాము ఈ కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు అవుతుందని, ఇప్పటివరకూ ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. బీజేపీతో బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగానే ఇది జరుగుతుందని సీఎం రేవంత్ ఆరోపించారు. ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరొకవైపు బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్‌ెడ్డి మాట్లాడుతూ.. ఎంఐఎం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లది చీకటి ఒప్పందమని విమర్శించారు.మరొకవైపు కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హైడ్రా పేరుతో ఇళ్లు కూలగొడుతుందని ధ్వజమెత్తారు.


