సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలులో దారుణం జరిగింది. సీనియర్ సిటిజన్లకు కేటాయించిన సీటు తనకు ఇవ్వాలంటూ కోరిన ఓ వృద్ధుడిపై ముగ్గురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. రైల్వే ట్రాక్‌పైకి నెట్టి దాడి చేశారు.
పోలీసుల వివరాల మేరకు.. అమీర్‌పేట్ నుండి మెట్రోలో ప్రయాణిస్తున్న 62 ఏళ్ల వృద్ధుడితో ముగ్గురు యువకులు దురుసు ప్రవర్తించారు. సీనియర్ సిటిజన్లకు కేటాయించిన సీటును ఇవ్వమని కోరగా యువకులు దుర్భాషలాడి అవమానించారు. లక్డికాపూల్ మెట్రో స్టేషన్ వద్ద ముగ్గురు యువకులు వృద్ధుడిని రైల్వే ట్రాక్‌పైకి నెట్టి గాయపరిచారు.
బాధితుడు వెంటనే ఘటనను సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు.బాధితుడి ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి వేగంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది. నిందితులు సివ్వల సునీల్ కుమార్ (32),సివ్వల రాజేష్ (34),కాలిశెట్టి అశోక్ (34) అని తెలుస్తోంది.


