
సాక్షి,హైదరాబాద్: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక తెలంగాణ లక్క్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు. తండ్రి కేసీఆర్ ఫొటో కాకుండా ప్రొఫెసర్ జయ శంకర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.
యాత్ర పోస్టర్లను సిద్ధం చేశారని, యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం (అక్టోబర్15) విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కవిత మేథావులు, విద్యావంతులతో భేటీ కానున్నారు.
అక్టోబర్ చివరి వారం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర తెలంగాణలోని అన్నీ జిల్లాలను కవర్ చేస్తూ ఫిబ్రవరిలో ముగియనుంది. కవిత తెలంగాణ యాత్రపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.