
హైదరాబాద్: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను శుక్రవారం ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో జవహర్‌నగర్ మాజీ మేయర్ కావ్య కలిశారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌ను మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ సారథ్యంలో మరోసారి తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.