
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో మాజీ సీఎం కేసీఆరే సుప్రీం అని స్పష్టం చేశారు. ఎవరి విషయంలోనైనా తుది నిర్ణయం పార్టీదే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. తన కూతురి అడ్మిషన్ కోసం ఆయన లండన్ వెళ్లారు. ఈ సందర్భంగా లండన్‌లో బీఆర్ఎస్ NRI నేతల మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘బీఆర్‌ఎస్‌లో మాజీ సీఎం కేసీఆరే సుప్రీం లీడర్. కలిసి పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ మాకు నేర్పించారు. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైనా హరీశ్ రావు విమర్శలు చేశారు.
మరోవైపు.. ఈ క్రమంలోనే అక్కడ మీడియా ఆయనను కవిత ఇష్యూపై ప్రశ్నించింది. కానీ, ఆయన సమాధానం చెప్పలేదు. ఇండియా వెళ్లిన తరువాతనే మాట్లాడతానని చెప్పినట్టు తెలిసింది. రేపు ఆయన ఇండియాకు రాబోతున్నట్టు సమాచారం. అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తే ఏం మాట్లాడుతారు అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.