ఓటీటీలోకి 'లోక'.. దుల్కర్ ట్వీట్‌‌తో క్లారిటీ | Lokah Movie OTT Streaming Update Latest | Sakshi
Sakshi News home page

Lokah OTT: 'లోక' మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్లారిటీ

Sep 21 2025 5:23 PM | Updated on Sep 21 2025 5:27 PM

Lokah Movie OTT Streaming Update Latest

రీసెంట్ టైంలో రెండు సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. తెలుగులో వచ్చిన 'మిరాయ్' హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతానికి రూ.120 కోట్ల వరకు కలెక్షన్ సాధించింది. మరోవైపు గత నెల చివర్లో 'లోక' అనే మలయాళ ఫిమేల్ సూపర్ హీరో మూవీ ఒకటి వచ్చింది. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రానుందనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వీటిపై నిర్మాత దుల్కర్ సల్మాన్ ఓ క్లారిటీ ఇచ్చాడు.

కల్యాణి ప్రియదర్శన్ 'లోక' సినిమాని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. ఇక్కడ పర్లేదనే టాక్ వచ్చింది గానీ వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. కానీ ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో మాత్రం అద్భుతమైన కలెక్షన్ వచ్చాయి. ప్రస్తుతం రూ.250 కోట్లకు పైనే వచ్చాయని, తద్వారా మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ మూవీని ఇప్పట్లో ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం లేదని నిర్మాత దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేశాడు. రూమర్స్‌ను నమ్మొద్దు. అధికారిక ప్రకటన కోసం వేచి చూడండి అని విజ్ఞప్తి చేశాడు.

(ఇదీ చదవండి: రాజమౌళి కంటే ధనుష్‌తోనే కష్టం: 'కట్టప్ప' సత్యరాజ్)

ఈ శుక్రవారం నుంచే 'లోక' స్ట్రీమింగ్ ఉండనుందనే రూమర్స్ వచ్చేసరికి చాలామంది నెటిజన్లు సంతోషపడ్డారు. కానీ ఈ చిత్ర నిర్మాత దుల్కర్ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చేసరికి సైలెంట్ అయిపోయారు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఇప్పటికీ థియేటర్లలో ఇంకా ఒరిజినల్ వెర్షన్ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కాబట్టి ఓటీటీ డేట్ అనుకున్న టైం కంటే కాస్త లేటుగా తీసుకురానున్నారు. అంటే అక్టోబరు రెండో వారం వస్తుందేమో చూడాలి?

'లోక' విషయానికొస్తే.. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ ఉన్న ఓ అమ్మాయి. ఈమె గురించి కొందరికి తెలుసు.  ఓ సందర్భంలో చంద్ర, బెంగళూరు రావాల్సి వస్తుంది. తన పవర్స్ బయటపెట్టకుండా సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. రాత్రిపూట ఓ కేఫ్‌లో పనిచేస్తుంటుంది. ఎదురింట్లో ఉంటే సన్నీ(నస్లేన్).. ఈమెని చూసి లవ్‌లో పడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల దెబ్బకు చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర గతమేంటి? ఎస్ఐ నాచియప్ప(శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఐఫోన్‌తో తీసిన జాంబీ సినిమా.. ఓటీటీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement