కో అంటే కోటి గుర్తుకొచ్చింది

Ram Charan unveils Sound Cut trailer of Ranarangam - Sakshi

– రామ్‌ చరణ్‌

‘‘రణరంగం’ సౌండ్‌ కట్‌ ట్రైలర్‌ చాలా కొత్తగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ చూశా. శర్వానంద్‌ని మేము ఎలా అయితే చూడాలనుకున్నామో అలాగే ఉంది. తనకు కరెక్ట్‌గా సరిపోయింది’’ అని హీరో రామ్‌చరణ్‌ అన్నారు. శర్వానంద్, కాజల్‌ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్‌ హీరో హీరోయిన్లుగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల  15న విడుదలకానుంది.

ఈ సినిమా సౌండ్‌ కట్‌ ట్రైలర్‌ని రామ్‌చరణ్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘శర్వాలో కష్టపడేతత్వం ఉంది. అదే మాకు నచ్చింది. అతని చిత్రాల్లో ‘కో అంటే కోటి’ నాకిష్టం. అలాంటి ఇంటెన్సిటీతో ఉన్న చిత్రం శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాణ్ణి. సౌండ్‌ కట్‌ ట్రైలర్‌ చూసిన తర్వాత ‘రణరంగం’ అలాంటి చిత్రం అనిపించింది. ఈ సినిమాతో సుధీరవర్మ తన ప్రతిభను మళ్లీ నిరూపించుకున్నారనిపించింది. సన్నివేశాల తాలూకు కట్స్‌ చాలా ఆసక్తిగా ఉన్నాయి.  ప్రశాంత్‌ పిళ్ళై సంగీతం బాగుండటంతో పాటు కొత్తగా ఉంది’’ అన్నారు. శర్వానంద్, సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు.  
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top