
గత వీకెండ్‌లో మూడు నాలుగు తెలుగు సినిమాలు రిలీజైతే వాటిలో కొన్నింటికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరోవైపు మలయాళ డబ్బింగ్ మూవీ 'కొత్త లోక'కి తెలుగులో ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. మెట్రో సిటీల్లో ఆదివారం వరకు మంచి ఆక్యుపెన్సీ చూపించింది. తొలి నుంచి ఇది సూపర్ హీరో తరహా యూనివర్స్ అని చెప్పిన టీమ్.. ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాల్ని రివీల్ చేసింది.
మనం పురాణాల్లో విన్న యక్షిణి పాత్రని తీసుకుని, దానికి సూపర్ పవర్స్ జోడించి 'కొత్త లోక' సినిమాని తీశారు. కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది. బడ్జెట్ కూడా రూ.35-40 కోట్ల మధ్యనే అని టాక్. అయితే ఇంత తక్కువ బడ్జెట్ పెట్టి ఈ రేంజు ఔట్ పుట్ చూపించడంపై ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. సినిమా పాజిటివ్ టాక్ రావడంతో పాటు రూ.60-70 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంటే లాభాల్లోకి ఎంటరైనట్లే.
(ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి సమంత దుబాయి ట్రిప్.. వీడియో వైరల్)
తాజాగా ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ గురించి మాట్లాడిన దర్శకుడు డొమినిక్ అరుణ్.. ఈ మూవీ ఫ్రాంచైజీలో మొత్తం ఐదు పార్ట్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు. అలానే 'కొత్త లోక' సినిమా ప్రారంభంలోనే మెయిన్ విలన్ ఎవరనేది హింట్ ఇచ్చామని పేర్కొన్నాడు. ఐదు భాగాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా షూటింగ్ మొదలవకముందే పూర్తి చేశామని క్లారిటీ ఇచ్చాడు.
ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించి ఆకట్టుకున్న టొవినో థామస్.. రెండో పార్ట్‌లో లీడ్ రోల్ చేస్తాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే 'కొత్త లోక' తొలి పార్ట్ చివరలో దుల్కర్ సల్మాన్ కూడా కనిపించాడు. రాబోయే పార్ట్స్‌లో ఏదో ఒకదానిలో దుల్కర్ కూడా కచ్చితంగా ఉండటం గ్యారంటీ. ఇప్పటివరకు కమర్షియల్‌గా గుర్తింపు తెచ్చుకున్న కల్యాణి.. ఈ సినిమాతో మరింతగా క్రేజ్ సంపాదిస్తుండటం విశేషం.
(ఇదీ చదవండి: 'ఓజీ' కొత్త గ్లింప్స్ రిలీజ్)