
'ఓజీ' సినిమా నుంచి కొత్త గ్లింప్స్ రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం.. కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. ఇందులో విలన్ పాత్రధారిని పరిచయం చేశారు. అతడి పాత్ర పేరు ఓమి. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఈ రోల్ చేశాడు. సదరు పాత్రతో గ్లింప్స్ చివరలో హ్యాపీ బర్త్ డే ఓజీ అని చెప్పించారు.
(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. సైలెంట్‌గా మొదలుపెట్టేశారు)
అంతా బాగానే ఉంది గానీ పవన్ పుట్టినరోజు సందర్భంగా అతడిని హైలైట్ చేసే గ్లింప్స్ లాంటిది పడితే అభిమానులు కాస్త ఖుషీ అయ్యేవారు. అలా కాకుండా హీరో కంటే విలన్ పాత్రకు ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చేలా గ్లింప్స్ రిలీజ్ చేయడం కాస్త విచిత్రంగా అనిపించింది. ఎప్పటిలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయి.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాని ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. సుజీత్ దర్శకుడు కాగా తమన్ సంగీతమందించాడు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సినిమాకు అభిమానుల్లో బజ్ గట్టిగానే ఉంది. పవన్ గత చిత్రం 'హరిహర వీరమల్లు' దారుణంగా ఫెయిల్ అవడంతో ఈ మూవీపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి సమంత దుబాయి ట్రిప్.. వీడియో వైరల్)