
హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అనగానే చాలామంది ప్రేక్షకులకు చిన్నచూపు. హా ఏముందిలే అని అనుకుంటారు. కానీ అప్పట్లోనే విజయశాంతి లాంటి హీరోయిన్స్.. 'కర్తవ్యం' లాంటి సినిమాలు చేశారు. బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ తర్వాత కాలంలో హీరోలు, కమర్షియల్ చిత్రాల హవా పెరిగేసరికి ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ రావడం బాగా తగ్గిపోయింది. కానీ గత దశాబ్ద కాలంలో మాత్రం దక్షిణాదిలో అడపాదడపా వస్తూనే ఉన్నాయి.
గత కొన్నేళ్లలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అనగానే అనుష్క గుర్తొస్తుంది. 'అరుంధతి'తో ట్రెండ్ సెట్ చేసిన ఈ బ్యూటీ.. తర్వాత రుద్రమదేవి, భాగమతి తదతరత చిత్రాలతో తన సకెస్స్‌ని కొనసాగించింది. తర్వాత కాలంలో పలువురు సౌత్ హీరోయిన్లు.. ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తీసినప్పటికీ అనుష్క దరిదాపుల్లోకి చేరుకోలేకపోయారు. కానీ 'మహానటి' మూవీతో కీర్తి సురేశ్ ఆ ఫీట్ సాధించింది. ఈ మూవీకి ఏకంగా రూ.84 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.
(ఇదీ చదవండి: 2 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్)
2018లో 'మహానటి' రాగా ఆ రికార్డ్ అలానే ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు 'కొత్త లోక' సినిమా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం.. రిలీజైన 7 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది. సాధారణంగా చూస్తే ఇదేమంత ఎక్కువ మొత్తంలా అనిపించకపోవచ్చు. కానీ మిడ్ రేంజ్ హీరోయిన్ అయిన కల్యాణి ప్రియదర్శన్‌ని లీడ్ రోల్‌లో పెట్టి తీసిన సూపర్ హీరో సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు అంటే కచ్చితంగా విశేషమే.
ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిన 'కొత్త లోక'.. ఇప్పుడు రూ.100 కోట్ల మార్క్ కూడా దాటేసినట్లు తెలుస్తోంది. తద్వారా మహానటి, రుద్రమదేవి, భాగమతి, అరుంధతి చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సౌత్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి ఇది ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: 'కూలీ' విలన్.. దుబాయి వెళ్లడానికి నో పర్మిషన్)