
ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటిలో థ్రిల్లర్, హారర్, యాక్షన్.. ఇలా వివిధ జానర్స్ ఉంటాయి. అయితే చాలామంది యాక్షన్ లేదా థ్రిల్లర్స్ చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.
(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
యాక్షన్ సినిమాలనగానే చాలామందికి హాలీవుడ్ గుర్తొస్తుంది. అందుకు తగ్గట్లే 2021లో వచ్చిన 'నోబడీ'.. ఈ జానర్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రాల్లో ఇది టాప్-10లో ఉండటం విశేషం. దీనికి సీక్వెల్ 'నోబడీ 2'.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్ వచ్చింది. మరి ఏమైందో ఏమో గానీ రెండు వారాలు తిరిగేసరికల్లా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు యూఎస్, యూకే లాంటి దేశాల్లో అందుబాటులో ఉంది. మరి వారం పదిరోజుల్లో మన దగ్గర కూడా రావొచ్చు.
'నోబడీ 2' విషయానికొస్తే.. భార్య, పిల్లలతో కలిసి హీరో విహారయాత్రకు వెళ్తాడు. అక్కడ సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. కానీ పిల్లలు అనుకోకుండా చేసిన ఓ పని వల్ల చిన్న గొడవ జరుగుతుంది. అది కాస్త పెద్దది అయి.. ఓ కోటీశ్వరుడి సామ్రాజ్యాన్ని నేలకూల్చే వరకు వెళ్తుంది. మరి హీరో.. తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ప్రారంభం నుంచి చివరివరకు కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్ ఉంటాయి. చిన్న గ్యాప్ అనేది లేకుండా యమ స్పీడుగా వెళ్తుంది. నిడివి కూడా గంటన్నర కావడం ఇక్కడ విశేషం.
(ఇదీ చదవండి: 'వీరమల్లు'కు జీఎస్‌టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?)