వయసైన వ్యక్తిగా శర్వా..!

Sharwanand New Makeover For Sudheer Varma Film - Sakshi

కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న శర్వానంద్‌ త్వరలో మరో డిఫరెంట్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఇటీవల పడి పడి లేచే మనసు సినిమాతో నిరాశపరిచిన శర్వా, తదుపరి చిత్రం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వా  రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. వీటిలో ఒకటి యువకుడి పాత్ర కాగా మరో పాత్రలో వయసైన వ్యక్తిగా కనిపించనున్నాడట. 

ఈ లుక్‌ కోసం ప్రోస్తటిక్‌ మేకప్‌తో లుక్‌ టెస్ట్ కూడా చేసిన చిత్రయూనిట్ త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. శర్వానంద్‌ సరసన హలో ఫేం కల్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. త‍్వరలోనే సినిమా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌లను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top