
మలయాళంలో తెరకెక్కిన ‘కొత్తలోక: చాప్టర్1’ కాసుల వర్షం కురిపించింది. అయితే, ఈ సినిమాకు సీక్వెల్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఒక వీడియోను పంచుకున్నారు. రూ. 30 కోట్లతో చిన్న సినిమాగా విడుదలైన కొత్తలోక ఏకంగా రూ. 267 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ చిత్రంగా నిలిచింది. దేశంలోనే మొదటి ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు డామినిక్ అరుణ్ తెరకెక్కించారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించారు.

కొత్తలోక చాప్టర్1లో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిశారు. అయితే, సీక్వెల్‌లో వీరి పాత్ర కీలకం కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన పార్ట్2 వీడియోలో వారిద్దర మధ్య జరిగిన సంభాషణను చూపించారు. సీక్వెల్‌ను కూడా డామినిక్ అరుణ్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదలైన ప్రత్యేక ప్రోమో అభిమానులను మెప్పిస్తుంది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. విడుదల తేదీ, నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.