గతేడాది బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన చిత్రాల్లో కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD Movie) ఒకటి. ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వెయ్యి కోట్లపైనే వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
దీపికా స్థానంలో కల్యాణి?
ఇలాంటి సమయంలో కల్కి సీక్వెల్ నుంచి దీపికా(Deepika Padukone)ను తొలగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. 8 గంటల పని, తన టీమ్ మెంబర్స్‌కు లగ్జరీ వసతులు, లాభాల్లో వాటా.. ఇలా కొన్ని భారీ షరతుల కారణంగా ఆమెను సైడ్ చేశారు. దీంతో దీపికా పాత్రలో ఎవరు నటించనున్నారంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. దీపికా స్థానంలో ఆలియా భట్, సాయిపల్లవి, అనుష్కల పేర్లు వినిపించాయి. ఇటీవల కొత్త లోక: చాప్టర్ 1తో సక్సెస్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.
అంతకన్నా సంతోషం ఇంకేముంది?
ఈ రూమర్‌పై కల్యాణి స్పందించింది. కొందరు ఇదేపనిగా యాక్టర్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారనుకుంటా.. ఏదేమైనా నా పేరు పరిశీలిస్తున్నారంటే నాకు సంతోషంగానే ఉంది. నన్ను ఎంపిక చేయాలని భావిస్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? కానీ, వాళ్లు ఎవర్ని ఫైనల్ చేశారు? ఎవరిని తీసుకోబోతున్నారు? అన్నది చెప్పడం చాలా కష్టం. జనాలు నన్ను ఆ పాత్రలో చూడాలని కోరుకుంటున్నారంటేనే ఎంతో సంబంరంగా ఉంది. ఇలాంటి అనుభూతి ఇంతకుముందెన్నడూ కలగలేదు అని చెప్పుకొచ్చింది.
చదవండి: పెళ్లి సందడి షురూ.. జగద్ధాత్రి సీరియల్ నటి హల్దీ ఫంక్షన్


