రణచదరంగం

ranarangam first look release - Sakshi

ఓ ఫ్యాక్టరీలో పని చేసే సాధారణ వ్యక్తి ఓ వ్యవస్థలా మారాడు. తనకంటూ ఓ ప్రత్యేక సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నాడు. ఆ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు.  మరి ఈ చదరంగంలో ఎలాంటి రణం చేశాడు? అన్నది తెలుసుకోవాలంటే ఆగస్ట్‌ 2 వరకూ వేచి చూడాల్సిందే. శర్వానంద్‌ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘రణరంగం’ అనే టైటిల్‌ ఖరారు చేస్తూ శర్వానంద్‌ ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో శర్వానంద్‌ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారు. ఫస్ట్‌ లుక్‌లో మధ్య వయసులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌లా ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ పొగను వదులుతున్నారు శర్వానంద్‌. ఈ చిత్రాన్ని నాగవంశీ, పీడీవీ ప్రసాద్‌ నిర్మించారు. కాజల్‌ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌ కథానాయికలు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 2న రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: దివాకర్‌ మణి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top