‘హీరో’గా మారుతున్న శివకార్తికేయన్‌

Siva karthikeyan Hero With Irumbu Thirai Fame Mithran - Sakshi

హీరోగా మారుతున్న శివకార్తికేయన్‌ అనగానే ఆశ్చర్యపడుతున్నారా? ఆయన ఎప్పుడో స్టార్‌ హీరోగా అయితే ఇప్పుడు హీరో అవ్వడం ఏమిటి? అనే డౌట్‌ ఎవరికైనా వస్తుంది. అసలు విషయం ఏమిటంటే శివకార్తికేయన్‌ నటిస్తున్న తాజా చిత్రానికి హీరో అనే టైటిల్‌ను నిర్ణయించా రు. ఇందులో నటుడు అర్జున్‌ ప్రధాన పాత్రను పోషించనుండడం విశేషం. నటి కల్యాణి ప్రియదర్శన్‌ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.

కేజేఆర్‌ ఫిలింస్‌ పతాకంపై కోటపాటి జే.రాజేశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇరుంబుదురై ఫేం మిత్రన్‌  దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హీరో చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కోటపాటి జే. రాజేశ్‌ మాట్లాడుతూ కేజేఆర్‌ ఫిలింస్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతిభావంతులైన యూనిట్‌తో చిత్రం చేయడం మరింత ఆనందంగా ఉందన్నారు.

నటుడు శివకార్తికేయన్‌ కమర్షియల్‌ అంశాలతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించడం వల్లే ఆయన నటుడిగా ఈ స్థాయికి చేరారన్నారు. అదే విధంగా ఈ హీరో చిత్రం కూడా అలాంటి కమర్శియల్‌ అంశాలతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. ఇక యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తో చిత్రం చేయాలన్నది తన చిరకాల కోరిక ఈ చిత్రంతో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు.

ఇక నటి కల్యాణి ప్రియదర్శన్‌ వంటి ప్రతిభావంతులైన యువ నటీనటులు ఈ చిత్రానికి అదనపు మైలేజ్‌ను ఇస్తారని అన్నారు. దర్శకుడు మిత్రన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన తొలి చిత్రంతోనే అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారని అన్నారు. ఆయన కథ చెప్పడానికి వచ్చినప్పుడు గత చిత్ర కథా ఛాయలేమైనా ఉంటాయేమోనని అనుకున్నానని, అలాంటి ఛాయలే లేకుండా పూర్తిగా భిన్నంగా చాలా కొత్త కోణంలో కథను చెప్పారని అన్నారు.

ఈ సినిమాకు యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని, జార్జ్‌ సి.విలియమ్స్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇకపోతే శివకార్తికేయన్‌ నయనతారతో కలిసి రాజేశ్‌.ఎం దర్శకత్వంలో స్టూడియోగ్రీన్‌ సంస్థ నిర్మిస్తున్న మిస్టర్‌ లోకల్‌ చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రం మేడే రోజున విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం తన 14వ చిత్రంగా రవికుమార్‌ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం పూర్తి అయిన తరువాత హీరో చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top