గ్యాంగ్‌ తిరిగొచ్చింది

Sharwanand, Kajal Aggarwal complete shooting in Spain - Sakshi

అవును.. శర్వానంద్‌ అండ్‌ గ్యాంగ్‌ తిరిగొచ్చారు. సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్‌ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దాదాపు నెల రోజులకు పైగా స్పెయిన్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. గత బుధవారంతో అక్కడ షెడ్యూల్‌ ముగిసింది. శర్వానంద్‌ అండ్‌ గ్యాంగ్‌ హైదరాబాద్‌ తిరిగొచ్చారు. ఈ షెడ్యూల్‌తో ఆల్మోస్ట్‌ చిత్రీకరణ పూర్తయిందని సమాచారం.

ఇందులో యువకుడిగా, మధ్య వయస్కుడైన గ్యాంగ్‌స్టర్‌గా శర్వా నంద్‌ డ్యూయెల్‌ రోల్‌ చేస్తున్నారు. స్పెయిన్‌లో జరిగిన షూట్‌లో శర్వా, కాజల్‌లపై కీలక సన్నివేశాలతో పాటు పాటలను కూడా తెరకెక్కించారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తమిళ హిట్‌ ‘96’ తెలుగు రీమేక్‌లో శర్వానంద్, సమంత నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ వేసవిలో ప్రారంభం కానుందట. ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిసింది. తమిళ చిత్రాన్ని తెరకెక్కించిన సి. ప్రేమ్‌కుమార్‌నే తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘దిల్‌’ రాజు నిర్మాత.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top