గ్యాంగ్‌స్టర్‌ ఈజ్‌ కమింగ్‌

Sharwanand Gangster Drama on July 5 - Sakshi

గ్యాంగ్‌స్టర్‌ ఎక్కడైనా చెప్పాపెట్టకుండా అటాక్‌ చేస్తాడు. కానీ ఈ గ్యాంగ్‌స్టర్‌ డేట్‌ చెప్పి మరీ వస్తున్నాను అంటున్నాడు. జూలై 6న థియేటర్స్‌లో రఫ్‌ ఆడిస్తానని చెబుతున్నారు. సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా ఓ గ్యాంగ్‌స్టర్‌ చిత్రం తెరకెక్కింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించారు. కాజల్‌ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌ కథానాయికలు. ఇందులో శర్వానంద్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. యంగ్‌ లుక్‌లో ఒకటి, గ్యాంగ్‌స్టర్‌గా ఓల్డ్‌ లుక్‌ మరోటి. ఈ సినిమాను జూలై 6న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు శర్వా‘96’ రీమేక్‌తో బిజీగా ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top