తేజ్‌కు మళ్లీ సుప్రీమ్‌ డేస్‌ వస్తాయి | chitralahari movie released on april 12 | Sakshi
Sakshi News home page

తేజ్‌కు మళ్లీ సుప్రీమ్‌ డేస్‌ వస్తాయి

Mar 14 2019 3:46 AM | Updated on Mar 14 2019 4:54 AM

chitralahari movie released on april 12 - Sakshi

కిషోర్, సునీల్, సాయిధరమ్‌ తేజ్, నివేదా, నవీన్, రవిశంకర్‌

సాయిధరమ్‌తేజ్, కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌ హీరోహీరోయిన్లుగా, ‘నేను శైలజా’ ఫేమ్‌ కిషోర్‌ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘చిత్రలహరి’. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి, రవి శంకర్‌ నిర్మించారు. ఏప్రిల్‌ 12న విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ను బుధవారం రిలీజ్‌ చేశారు. కిషోర్‌ తిరుమల మాట్లాడుతూ – ‘‘అడగ్గానే వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన దర్శకుడు సుకుమార్‌గారికి థ్యాంక్స్‌. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్‌.  సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కిషోర్‌ ఈ టైటిల్‌ చెప్పగానే బాగా నచ్చింది. ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేస్తాం.

ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సాయి ధరమ్‌ తేజ్‌కు మళ్లీ ‘సుప్రీమ్‌’ డేస్‌ వస్తాయి అనే నమ్మకం ఉంది’’ అన్నారు నవీన్‌ ఎర్నేని. ‘‘మంచి పాత్ర కోసం చూస్తున్న తరుణంలో కిషోర్‌గారు ఈ పాత్రను ఇచ్చారు. ప్రేక్షకుడు నవ్వుతూనే ఇంటికి వెళ్తాడు’’ అన్నారు సునీల్‌.‘‘కిషోర్‌గారు కథ ఎంత బాగా చెప్పారో అంతే బాగా తీశారు. సునీల్‌ అన్న కామెడీని నేను బాగా ఎంజాయ్‌ చేస్తాను. ఆయనతో వర్క్‌ చేయడం హ్యాపీ’’ అన్నారు సాయిధరమ్‌. ‘‘కిషోర్‌గారు నా పాత్రను బ్యూటి ఫుల్‌గా డిజైన్‌ చేశారు. సాయిధరమ్, కల్యాణితో వర్క్‌ చేయడం హ్యాపీ’’ అన్నారు నివేదా.
 

Advertisement
 
Advertisement
Advertisement