
మలయాళ స్టార్ నటుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) రికార్డులు తిరగరాస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త లోక: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీ మోహన్‌లాల్ 'ఎల్2: ఎంపురాన్' కలెక్షన్లను దాటేసి ఏకంగా రూ.266 కోట్లు రాబట్టింది. దీంతో మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మొట్టమొదటి చిత్రంగా రికార్డులోకెక్కింది.
మంచి సలహా
సూపర్ హీరోగా నటించిన కల్యాణికి సౌత్ నుంచి నార్త్ వరకు అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ తరుణంలో ఆమె తండ్రి విజయాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోవద్దని జాగ్రత్తలు చెప్పాడు. అలాగే పరాజయాన్ని మనసుకు తీసుకోవద్దని మంచి మాట చెప్పాడు. కల్యాణి కూడా ఎప్పుడూ స్టార్ హీరో కూతుర్ని అని ఎప్పుడూ బిల్డప్ కొట్టలేదు. పైగా తండ్రి మాటను తు.చ తప్పకుండా పాటిస్తుంది.
అనాథాశ్రమంలో..
అందుకే చిన్నప్పుడు తల్లిదండ్రుల కోరిక మేరకు కొద్దిరోజులపాటు అనాథాశ్రమంలో ఉంది. కల్యాణియే కాదు, ఆమె సోదరుడు సిద్దార్థ్ కూడా అనాథాశ్రమంలో ఉన్నారు. మలయాళ స్టార్ జంట ప్రియదర్శన్- లిస్సీ జంటే తమ పిల్లల్ని వియత్నాంలోని ఓ ఆశ్రమంలో చేర్పించారు. అయితే ఇందుకో బలమైన కారణం ఉంది. పేరు, సంపాదన, లగ్జరీని పక్కనపెట్టి జీవితం విలువ నేర్పడానికే వాళ్లు ఈ పని చేశారు. కల్యాణి, సిద్దార్థ్ కూడా అనాథలతో కలిసి తినేవారు, ఆడుకునేవారు, వాళ్లతోనే కలిసి నిద్రించేవారు. అలా చిన్నప్పటినుంచే వారికి మానవత్వం, మంచితనం వంటి విలువలను నేర్పించారు.
చదవండి: నా పుట్టినరోజునాడే తను చనిపోయాడు.. జీవితంలో మర్చిపోలేని విషాదం