
కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మలయాళ చిత్రం లోకా చాప్టర్-1 చంద్ర. ఈ మూవీని తెలుగులో కొత్త లోకా పేరుతో రిలీజ్ చేశారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం మలయాళంలో మాత్రమే కాదు.. తెలుగులోనూ వసూళ్లపరంగా అదరగొట్టేసింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డ్ క్రియేట్ చేసింది.
మలయాళంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా లోకా చాప్టర్-1 చంద్ర నిలిచింది. ఈ క్రమంలో ఏకంగా పృథ్వీరాజ్ సుకుమారన్ మోహన్ లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్ సినిమాను అధిగమించింది. కాగా.. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్‌కు చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించింది. ఆగస్టు 28న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
ఈ మూవీ రిలీజైన 23 రోజుల్లో ఇండియాలో రూ.130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.266 కోట్లు కలెక్ట్ చేసింది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఎల్2 ఎంపురాన్ మనదేశంలో రూ.105 కోట్లకు పైగా కలెక్షన్స్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.265.5 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో కొత్త లోకా ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల్లో మొదటి స్థానం దక్కించుకుంది.