
తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయిన కల్యాణి ప్రియదర్శన్.. ఇప్పుడు పూర్తిగా మలయాళ ఇండస్ట్రీకే పరిమితమైంది. అక్కడే స్టార్ హీరోలతో కలిసి మూవీస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె ప్రధాన పాత్రలో, 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్ మరో కీ రోల్ చేసిన చిత్రం 'లోక'. తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
(ఇదీ చదవండి: 'ఇది నా ఊరు సర్'.. ఫుల్ యాక్షన్‌తో 'మదరాశి' ట్రైలర్)
పూర్తిగా సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తీసిన మూవీ అని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. సాధారణంగా ఇలాంటివి హీరోలు చేస్తుంటారు. కానీ యంగ్ హీరోయిన్‌తో ఈ జానర్ సినిమా చేయడం విశేషం. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ దీన్ని నిర్మించాడు. డొమినిక్ అరుణ్ దర్శకుడు.
తెలుగులో ఈ సినిమా 'కొత్త లోక' పేరుతో ఈనెల 28న థియేటర్లలోకి రానుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. ట్రైలర్ బట్టి చూస్తే.. సూపర్ హీరో లక్షణాలుండే లోక(కల్యాణి ప్రియదర్శన్) అనుకోని పరిస్థితుల్లో ఓ ఊరికి వెళ్తుంది. అక్కడే లో-ప్రొఫైల్ మెంటైన్ చేస్తూ బతుకుతుంటుంది. అలాంటి ఊరిలో కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని లోక ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: 100వ సినిమా తర్వాత విశ్రాంతి తీసుకుంటా: దర్శకుడు ప్రియదర్శన్)