ఎవరి సలహాలూ వినొద్దన్నారు | Kalyani Priyadarshan interview about Ranarangam | Sakshi
Sakshi News home page

ఎవరి సలహాలూ వినొద్దన్నారు

Aug 13 2019 12:32 AM | Updated on Aug 13 2019 5:30 AM

Kalyani Priyadarshan interview about Ranarangam - Sakshi

కల్యాణీ ప్రియదర్శన్‌

‘‘1980–90ల కాలంలో వచ్చిన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆ రోజుల్లో పుట్టి ఉంటే ఎంత బాగుండేది? అని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఇప్పుడు ‘రణరంగం’లో అలాంటి పాత్ర చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని కల్యాణీ ప్రియదర్శన్‌ అన్నారు. శర్వానంద్, కాజల్‌ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌ ముఖ్యపాత్రల్లో సుధీర్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణి చెప్పిన విశేషాలు...

► ‘రణరంగం’ కథను సుధీర్‌ వర్మ బాగా చెప్పారు. ఇందులో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా నిలుస్తుంది. ఫ్లాష్‌బ్యాక్, ప్రస్తుతం... రెండూ సమానంగా నడుస్తుంటాయి. ంలో కచ్చితంగా భాగమవ్వాలనుకున్నా

► శర్వానంద్‌ పాత్ర జీవితంలో ఓ ఇరవై ఏళ్ల కాలాన్ని ఈ సినిమాలో చూపించనున్నాం. సాధారణ వ్యక్తి డాన్‌గా ఎలా ఎదిగారు? అన్నది కథాంశం. సినిమా మొత్తం తను చాలా సీరియస్‌గా, ఇంటెన్స్‌గా ఉంటారు. తనలో లవ్‌ యాంగిల్‌ ఉన్నా, ఎప్పుడైనా నవ్వినా అది నా పాత్ర (గీత) వల్లే. కథ 1990ల కాలంలో నడుస్తుంది. ఆ లుక్‌లో కనిపించడానికి మా అమ్మ (నటి లిజీ) సినిమాలో లుక్‌ను ప్రేరణగా తీసుకున్నాను. అమ్మ, శోభనగారి సినిమాలు చూశాను.

► నాకు గన్‌ పట్టుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. ‘రణరంగం’ లో నేను గన్‌ పేల్చే సీన్‌ కూడా ఉంది.  

► నేను తెలుగు సినిమాలు చేస్తున్నానని అమ్మ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాలో ఫస్ట్‌ టైమ్‌ లంగా వోణి వేసుకున్నా. ఆ డ్రెస్‌ నాకు బావుంటుందని నాన్నగారు (మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌) చాలా సార్లు అనేవారు.

► ఐదు సినిమాల అనుభవం వచ్చే వరకు నాన్నగారి దర్శకత్వంలో నటించకూడదనుకున్నాను. కానీ మోహన్‌లాల్‌తో నాన్న చేస్తున్న ‘అరేంబికడలంటే సింహం’లో అతిథి పాత్ర చేశాను.  తొలుత నటన సరిగ్గా లేదన్నారు.. ఎడిటింగ్‌లో చూసి బావుందన్నారు. నాన్న దర్శకత్వంలో మళ్లీ చేయకూడదనుకుంటున్నాను (నవ్వుతూ).

► సినిమాలు చేయాలనుకున్నప్పుడు అది చేయి.. ఇది చేయి అని అమ్మన్నాన్నలు సలహాలు ఇవ్వలేదు. ‘ఎవరు పడితే వాళ్లు సలహాలు ఇస్తుంటారు. దాన్ని మాత్రం తీసుకోకు’ అని చెప్పారు. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌ సినిమాలో నటిస్తున్నాను. సినిమా దర్శకత్వం చేయాలనే ఆలోచనలున్నాయి. కొన్ని ఐడియాలు  ఉన్నాయి.

► స్క్రిప్ట్‌ బాగుంటే పాత్ర నిడివి ఎంత? ఫిమేల్‌ ఓరియంటెడ్‌ సినిమానా? కమర్షియల్‌ సినిమానా? అనే పట్టింపు లేదు. రెండు నిమిషాల పాత్ర అయినా చేయడానికి సిద్ధమే. ‘మహానటి’కి కీర్తీ సురేశ్‌కు, కాçస్ట్యూమ్‌ డిజైనర్‌ ఇంద్రాక్షి పట్నాయక్‌కి నేషనల్‌ అవార్డ్‌ రావడం సంతోషంగా అనిపించింది.. వాళ్లిద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్‌.

► నాకు, మా దర్శకుడు సుధీర్‌ వర్మకు హాలీవుడ్‌ దర్శకుడు క్వంటిన్‌ టరాంటినో అంటే బాగా ఇష్టం. ఆయన తీసిన ‘కిల్‌ బిల్‌’ నా ఫేవరెట్‌ సినిమా. సుధీర్, నేను సెట్లో కలసిపోవడానికి ఈ కామన్‌ ఇంట్రెస్ట్‌ ఉపయోగపడింది. ఈ నెల 15న క్వంటిన్‌ కొత్త సినిమా ‘వన్స్‌ అఫాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌’, మా ‘రణరంగం’ ఒకేసారి రిలీజ్‌ అవుతుండటం విశేషం. ఆరోజు మేం రెండు సినిమాలు చూడాలి (నవ్వుతూ).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement