
లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కలెక్షన్స్ పెద్దగా రావంటుంటారు! కానీ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించిన 'కొత్త లోక మూవీ' ఆ వాదనను కొట్టిపారేసింది. సెంచరీలు కొడుతోంది. బాక్సాఫీస్ వద్ద రిలీజైన 13 రోజుల్లోనే రూ.202 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇంతటి ఘన విజయం సాధించినందుకు అందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు.
ఇదే నా సలహా: తండ్రి మెసేజ్
ఇలాంటి సమయంలో కల్యాణికి తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అదేంటనేది ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసింది. 'ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో.. విజయ గర్వాన్ని తలకెక్కించుకోకు, ఫ్లాప్ వచ్చినప్పుడు ఆ బాధను మనసులో మోయకు.. నేను నీకు ఇచ్చే మంచి సలహా ఇదే! లవ్యూ..' అని కూతురికి మెసేజ్ పెట్టాడు. అందుకు కల్యాణి.. తప్పకుండా మీరు చెప్పింది పాటిస్తాను నాన్నా, లవ్యూ అని రిప్లై ఇచ్చింది.

సినిమా
తన సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు సైతం అభినందనలు తెలిపింది. 'మీ వల్లే సినిమాకు ఈ రేంజ్‌లో కలెక్షన్స్ వస్తున్నాయి. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నాకు మాటలు రావడం లేదు. మన ఇండస్ట్రీలో కంటెంటే కింగ్. కథలో దమ్ముంటే మీరు దాన్ని అందలం ఎక్కిస్తారని మరోసారి రుజువు చేశారు' అని రాసుకొచ్చింది. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ 'కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర'. కల్యాణి ప్రియదర్శన్, నస్లీన్ ప్రధాన పాత్రలు పోషించారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. ఈ మూవీ ఆగస్టు 28న మలయాళంలో రిలీజైంది. ఒకరోజు ఆలస్యంగా ఆగస్టు 29న సాయంత్రం తెలుగులో విడుదలైంది.