
ఇప్పటివరకు పలు భాషల్లో సూపర్ హీరో తరహా సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్‌ని లీడ్ రోల్‌లో పెట్టి ఇలాంటి మూవీని మలయాళంలో తీశారు. అదే 'లోకా'. తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. కల్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్ర పోషించింది. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా.. అది ఆకట్టుకునేలా ఉంది.
(ఇదీ చదవండి: దుల్కర్ సల్మాన్ 'కాంత' టీజర్ రిలీజ్)
'హలో', 'చిత్రలహరి' లాంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన కల్యాణి ప్రియదర్శన్.. తర్వాత పూర్తిగా మలయాళ చిత్రసీమకే పరిమితమైపోయింది. మిడ్ రేంజ్ మూవీస్‌లో నటిస్తూ కెరీర్ పరంగా బాగానే ఉంది. అయితే ఈమెని పెట్టి సూపర్ హీరో జానర్ మూవీ తీయడం విశేషం. 'లోకా'ని తెలుగులోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో కల్యాణికి జోడిగా 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్ నటిస్తున్నాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)