
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నిర్మించిన తాజా సినిమా ‘కొత్త లోక’ (Kotha Lokah) టాలీవుడ్లో కూడా విజయవంతంగా రన్ అవుతుంది. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) సూపర్ యోధగా నటించి మెప్పించింది. ఫాంటసీ థ్రిల్లర్కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లో ఈ మూవీ చేరింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కన్నడ ప్రేక్షకులకు దుల్కర్ సల్మాన్ క్షమాపణలు చెప్పారు.
'లోక చాప్టర్1: చంద్ర' చిత్రంలో ఒక సంభాషణ కన్నడ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై చిత్ర నిర్మాతలు క్షమాపణలు చెప్పారు. 'ఈ సినిమాలో ఒక పాత్ర చెప్పిన సంభాషణ కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని మాకు సమాచారం వచ్చింది. దీనికి మేము చింతిస్తున్నాము. పొరపాటున జరిగినప్పటికీ మేము బాధ్యత వహిస్తున్నాం. ఈ సంభాషణను వీలైనంత త్వరగా తొలగిస్తాం లేదా సవరిస్తాం. మా వల్ల జరిగిన తప్పుకి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాం' అని తెలిపారు.