
'కల్కి 2898 ఏడీ' సినిమా నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను తప్పించిన తర్వాత ఆ స్థానాన్ని భర్తి చేసేది ఎవరు అనే ప్రశ్న చాలామందిలో ఉంది. ఈ విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ఈ ఏడాది చివరిలో సీక్వెల్ షూటింగ్ ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు సడెన్‌గా దీపికను తప్పించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కల్కిలో దీపికా పదుకొణె పర్‌ఫార్మెన్స్ చాలా బాగుందని, తన క్యారెక్టర్‌లో ఆమె లీనమై నటించారని టాక్ ఉంది. ఇప్పుడు ఆ స్థానాన్ని రీప్లేస్ చేసే ఏకైక హీరోయిన్ అనుష్క మాత్రమేనని సోషల్‌మీడియాలో చాలామంది తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.
దీపిక పదుకొణెను రీప్లేస్ చేసే హీరోయిన్ కోసం కల్కి యూనిట్ ఇప్పటికే వేట మొదలు పెట్టింది. ఈ క్రమంలో సోషల్‌మీడియాలో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభాస్-అనుష్క కలిసి మరోసారి సినిమా చేస్తే చూడాలని అభిమానులతో పాటు నెటిజన్లు కూడా కోరుతున్నారు. బాహుబలి తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఎక్కడా కూడా కనిపించలేదు. అందువల్ల దీపిక స్థానాన్ని అనుష్కతో భర్తీ చేస్తే సినిమాకు మరింత జోష్ రావడం ఖాయం అంటున్నారు.బాహుబలిలో గర్భవతిగా అనుష్క కనిపించిన విషయం తెలిసిందే. కల్కిలో కూడా దీపిక గర్భవతిగానే కనిపిస్తుంది. దీంతో ఎక్కువ మంది ఇదే కంటిన్యూటీని కోరుకుంటున్నారు.

'కొత్త లోక' సినిమాతో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న 'కళ్యాణి ప్రియదర్శన్'ను కల్కి కోసం ఎంపిక చేసినా బాగుంటుందని కొందరు చెబుతున్నారు. కొత్త లోక సినిమాలో ఆమె సూపర్ యోధగా నటించి అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో నయనతార, అలియా భట్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ త్వరలో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.