
సినిమా తారలపై రకరకాల రూమర్స్ వస్తుంటాయి. వాళ్ల సినిమాలతో పాటు పర్సనల్ విషయాలపై కూడా నెట్టింట గాసిప్స్ చక్కర్లు కొడుతుంటాయి. అయితే చాలా మంది నటీనటులు వాటిని పెద్దగా పట్టించుకోరు. అవసరం అయితే తప్ప స్పందించరు. అయితే ఆ అబద్దం నిజమని నమ్మినట్లుగా తెలిస్తే మాత్రం వెంటనే ఖండిస్తారు. తాజాగా నటి కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan ) అదే పని చేశారు. తనపై మీడియాలో వచ్చిన ఓ పుకారుని తీవ్రంగా ఖండించారు.
తనను, తన సోదరుడిని తల్లిదండ్రులు వియత్నాంలోని అనాథశ్రమంలో వారం రోజుల పాటు వదిలి వెళ్లారని.. జీవితం అంటే ఏంటో తెలియాలనే ఉద్దేశ్వంతో అలా చేశారని కల్యాణి చెప్పినట్లుగా ఓ సినీ వెబ్‌సైట్ వార్తలను రాసుకొచ్చింది. ఈ విషయం కళ్యాణి దృష్టికి వెళ్లడంతో..ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి మాటలను నేనెప్పుడు అనలేదని..దయచేసి ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
కాగా, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురే ఈ కల్యాణి.‘హలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘చిత్రలహరి’తో మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల ఆమె నటించిన ‘కొత్త లోక’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆగస్ట్ 28న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 270పైగా వసూళ్లను సాధించింది.. మలయాళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రగా నిలిచింది.