మిస్‌ శ్వేత

Nazriya Nazim making a comeback with Pink Tamil remake - Sakshi

ఇటీవల అజిత్‌ పూర్తి చేసిన ‘విశ్వాసం’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌ హిట్‌ ‘పింక్‌’ తమిళ రీమేక్‌లో ఆయన లాయర్‌గా నటించనున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో నజ్రియా, కల్యాణీ ప్రియదర్శన్, శ్రద్ధాశ్రీనాథ్‌ నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో శ్వేత అనే పాత్రను నజ్రియా చేయబోతున్నట్లు కోలీవుడ్‌ సమాచారం. బోనీకపూర్‌ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుందని టాక్‌. ఈ సినిమాకు ‘ఖాకి’ ఫేమ్‌ హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top