‘రణరంగం’ మూవీ రివ్యూ

Ranarangam Telugu Movie Review - Sakshi

టైటిల్‌ : రణరంగం
జానర్‌ : రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామా
తారాగణం : శర్వానంద్‌, కళ్యాణీ  ప్రియదర్శన్‌, కాజల్‌ అగర్వాల్‌ తదితరులు
సంగీతం : ప్రశాంత్‌ పిళ్లై
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం : సుధీర్‌ వర్మ

తన నటనతో పాత్రకు ప్రాణం పోసే శర్వానంద్‌.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ప్రయోగాలతో అదృష్టాన్ని పరీక్షించుకునే ఈ హీరో.. ‘రణరంగం’ చిత్రంతో మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో శర్వానంద్‌ మంచి విజయాన్ని అందుకున్నాడా? లేదా? అన్నది చూద్దాం.

కథ
విశాఖపట్నంలో తన స్నేహితులతో కలిసి బ్లాక్‌ టిక్కెట్లు అమ్ముకునే దేవా (శర్వానంద్‌).. లిక్కర్‌ మాఫియాకు కింగ్‌లా మారుతాడు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేదం అయిన సమయంలో దేవా లిక్కర్‌ స్మగ్లింగ్‌ చేస్తూ.. ఎవరికి అందనంత ఎత్తుకు చేరుతాడు. ఈ క్రమంలో లోకల్‌ ఎమ్మెల్యే సింహాచలం(మురళీ శర్మ)-దేవాల మధ్య శత్రుత్వం పెరుగతుంది. అదే సమయంలో గీత(కళ్యాణీ ప్రియదర్శిణి)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దేవా.. ఓ పాప పుట్టిన తరువాత గొడవలన్నింటిని వదిలేసి స్పెయిన్‌కు వెళ్తాడు. దేవా స్పెయిన్‌కు ఎందుకు వెళ్లవలసి వచ్చింది? గీత ఏమైంది? డాన్‌గా మారిన దేవాకు అసలు శత్రువు ఎవరు? అనేది మిగతా కథ

నటీనటులు
తన వయసుకు కంటే ఎక్కువ ఏజ్‌ ఉన్న పాత్రలను, ఎక్కువ ఇంటెన్సెటీ ఉన్న పాత్రలను చేయడంలో శర్వానంద్‌ దిట్ట అని అందరికీ తెలిసిన విషయమే. మళ్లీ ఈ చిత్రంలో యంగ్‌ లుక్‌, ఓల్డ్‌ లుక్‌తో పాటు నటనతో నూ మెప్పించాడు. కళ్యాణీ  ప్రియదర్శన్‌ నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ కట్టిపడేస్తాయి. తన పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో.. కాజల్‌ ఆటలో అరిటిపండులా అయిపోయింది. ఇక మురళీ శర్మ, దేవా స్నేహితుల పాత్రలో నటించిన వారు తమ పరిధిమేరకు నటించారు.

విశ్లేషణ
మాఫియా డాన్‌ లాంటి నేపథ్యం ఉన్న సినిమాలను తెరపై ఇప్పటివరకు ఎన్నో చూశాం. అయితే అన్నిసార్లు ఈ కథలు ప్రేక్షకులకు ఎక్కకపోవచ్చు. ఒక్కోసారి కథా లోపం కావచ్చు.. ఆ కథను చెప్పడానికి ఎంచుకున్న కథనం కావచ్చు ఇలా మాఫియా నేపథ్యంలో వచ్చిన కథలు బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. రణరంగం విషయానికొస్తే.. కథ పాతదే అయినా దానికి మద్యపాన నిషేదం అంటూ లోకల్‌ టచ్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రంలో కథ కాస్త ముందుకు వెళ్తుంది మళ్లీ వెనక్కు వస్తుంది. ఇలా ముందుకు వెళ్తూ వెనుకకు రావడంతో ప్రేక్షకుడు కాస్త అసహనానికి లోనయ్యే అవకాశం ఉంది.

ఫస్ట్‌ హాఫ్‌ ఆసక్తికరంగా సాగగా.. సెకండాఫ్‌ను ఆ స్థాయిలో చూపించలేకపోయాడు. అయితే ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాలు, రొమాంటిక్‌ సీన్స్‌ను అందంగా.. అందరికీ కనెక్ట్‌ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. కథ పాతదే కావడం, ఎంచుకున్న స్క్రీన్‌ప్లే సరిగా లేకపోడంతో రణరంగం అస్తవ్యస్తంగా మారింది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌ బాగున్నా.. కథనాన్ని మాత్రం ముందే పసిగట్టేస్తాడు ప్రేక్షకుడు. ఆడియెన్స్‌ ఊహకు అందేలా కథనం సాగడం మైనస్‌ కాగా.. సంగీతం, నేపథ్యం సంగీతం ప్రధాన బలం. ప్రతీ సన్నివేశాన్ని తన నేపథ్య సంగీతంతో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు సంగీత దర్శకుడు. 1990 బ్యాక్‌ డ్రాప్‌ను అందంగా తెరకెక్కించేందుకు కెమెరామెన్‌ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్‌కు ఇంకాస్త పదును పెడితే బాగుండేదనే ఫీలింగ్‌ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌
శర్వానంద్‌
సంగీతం
సినిమాటోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌
కథాకథనాలు
ఎంటర్‌టైన్‌మెంట్‌ లోపించడం
ఊహకందేలా సాగే కథనం

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top