రాజకీయం చేస్తారా?

Simbu paired opposite Kalyani Priyadarshan in Maanadu - Sakshi

టాలీవుడ్‌ను, కోలీవుడ్‌ను భలేగా బ్యాలెన్స్‌ చేస్తున్నారు హీరోయిన్‌ కల్యాణీ ప్రియదర్శన్‌. తెలుగులో సాయిధరమ్‌తేజ్‌ (చిత్రలహరి), శర్వానంద్‌ సినిమాల షూటింగ్‌ను కంప్లీట్‌ చేశారు. ఇటీవల తమిళంలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా రూపొందనున్న ‘వాన్‌’ సినిమాలో కథానాయికగా నటించే చాన్స్‌ కొట్టేశారు. తాజాగా శింబు హీరోగా నటించనున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘మానాడు’ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తారు. ‘‘అమేజింగ్‌ స్క్రిప్ట్‌. ‘మానాడు’ షూటింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు కల్యాణి. మరి.. ఇది పొలిటికల్‌ థ్రిల్లర్‌ కాబట్టి ఇందులో కల్యాణి ఏదైనా పొలిటికల్‌ పార్టీకి చెందిన అమ్మాయి పాత్రలో కనిపిస్తారా? లేక వేరే పాత్రలో అలసరిస్తారా? వెయిట్‌ అండ్‌ సీ!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top