జూన్‌లో జాయినింగ్‌ | sharwanand, kajal agarwal new movie start at june | Sakshi
Sakshi News home page

జూన్‌లో జాయినింగ్‌

May 14 2018 2:03 AM | Updated on Oct 30 2018 6:01 PM

sharwanand, kajal agarwal new movie start at june - Sakshi

జూన్‌ స్టార్టింగ్‌లో స్కూల్స్‌ అన్నీ ఓపెన్‌ అవుతూ ఉంటాయి. కొత్త స్టూడెంట్స్‌ అందరూ స్కూల్‌లో జాయిన్‌ అవ్వడానికి రెడీ అవుతుంటారు. కాజల్‌ అగర్వాల్‌ కూడా కొత్త స్టూడెంట్‌లాగానే కొత్త సినిమా సెట్‌లోకి జాయిన్‌ అవుతారు. సుధీర్‌ వర్మ డైరెక్షన్‌లో శర్వానంద్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై పీడీవీ ప్రసాద్, నాగ వంశీ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో శర్వానంద్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. శర్వానంద్‌ లుక్‌ డిఫరెంట్‌గా ఉండబోతుందట. ఇందులో ఆల్రెడీ ఒక హీరోయిన్‌గా ‘హలో’ ఫేమ్‌ కల్యాణీ ప్రియదర్శన్‌ యాక్ట్‌ చేస్తున్నారు. మరో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ను కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. జూన్‌ 15 నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు కాజల్‌. ప్రస్తుతం బాలీవుడ్‌ హిట్‌ ‘క్వీన్‌’ తమిళ రీమేక్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ చిత్రంలో నటిస్తున్నారు కాజల్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement