
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్(Farhan Akhtar) ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. దాదాపు మూడు కోట్లకు పైగా విలువైన మెర్సిడెజ్ బెంజ్‌ను తన సొంతం చేసుకున్నారు. ముంబయిలోని బాంద్రాలో తన కొత్త కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫర్హాన్ తన భార్య శిబానీ దండేకర్‌తో కలిసి కనిపించారు. ఈ లగ్జరీ కారును ఇతర బాలీవుడ్ ప్రముఖులు దీపికా పదుకొనే, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, కృతి సనన్ గతంలోనే కొన్నారు
ఇక సినిమాల విషయానికొస్తే ఫర్హాన్ అక్తర్ 120 బహదూర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని రెజాంగ్ లా యుద్ధం (1962) నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీత మేజర్ షైతాన్ సింగ్ భాటి పాత్రలో ఫర్హాన్ కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీకి రజనీష్ రాజీ ఘాయ్ దర్శకత్వం వహించారు. అమిత్ చంద్రతో కలిసి ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు.