చలానాలు కట్టకుండా.. రికార్డ్ క్రియేట్ చేశాడు! | TG Traffic Police Finally Caught Man With 95 Pending Challans With 34 Thousand 600 Rupees | Sakshi
Sakshi News home page

చలానాలు కట్టకుండా.. రికార్డ్ క్రియేట్ చేశాడు!

Apr 6 2026 9:35 AM | Updated on Apr 6 2026 9:39 AM

TG Traffic Police Finally Caught Man With 95 Pending Challans With 34 Thousand 600 Rupees

హైదరాబాద్‌: సుమారు 95 ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసులు పెండింగ్‌లో ఉన్న కారును ఆదివారం పట్టుకున్నట్లు ఎల్‌బీనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడ వెళ్లే రహదారిపై ట్రాఫిక్‌ ఎస్‌ఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా.. పోలదాస్‌ సురేష్‌కు చెందిన కారుపై 95 ట్రాఫిక్‌ చలానాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. మొత్తం రూ.36,600 వేల జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయని, కారు యజమాని గతంలో మూడుసార్లు ట్రాఫిక్‌ పోలీసులను తప్పించుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి కారును స్వా«దీనం చేసుకున్నామన్నారు.  

464 మంది ‘నిషా’చరులకు చెక్‌ 
సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు వీకెండ్స్‌తో ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగిస్తున్నారు. గత శుక్ర, శనివారాల్లో నగర వ్యాప్తంగా డ్రంకన్‌ డ్రైవింగ్‌లో 464 మంది పట్టుబడినట్లు ట్రాఫిక్‌ చీఫ్‌ డి.జోయల్‌ డెవిస్‌ ఆదివారం వెల్లడించారు. వీరిలో 408 మంది ద్విచక్ర, 30 మంది త్రిచక్ర, 26 మంది తేలికపాటి వాహనాల చోదకులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నట్లు చెప్పారు.     

Advertisement
 
Advertisement
Advertisement