
ప్రముఖ బుల్లితెర నటి నియా శర్మ ఖరీదైన కారు కొనుగోలు చేసింది. తాజాగా మెర్సిడెస్-బెంజ్‌ను తన సొంతం చేసుకుంది. ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ. 1.50 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ కారు కొనడంతో తన డబ్బు అంతా అయిపోయిందని.. ఇప్పుడు ఈఎంఐ మాత్రమే అందుబాటులో ఉందని నియా శర్మ ఫన్నీగా పోస్ట్ చేసింది.
కాగా.. ఢిల్లీకి చెందిన నియా శర్మ పదేళ్లకు పైగా బుల్లితెర నటిగా రాణిస్తోంది. 2010లో కాళీ - ఏక్ అగ్నిపరీక్ష సీరియల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఏక్ హజారోన్ మే మేరీ బెహ్నా హై షో సీరియల్‌తో ఫేమస్ అయింది. అంతేకాకుండా జమై రాజా, ఇష్క్ మే మార్జావాన్, నాగిన్- 4, సుహాగన్ చుడైల్ లాంటి షోలలో కనిపించింది. ఆమె చివరిసారిగా రియాలిటీ షో లాఫర్ చెఫ్స్ సీజన్- 2లో మెరిసింది. అయితే నియా బిగ్ బాస్‌లో పాల్గొంటుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ తాను బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదని సోషల్ మీడియా ద్వారా నియా స్పష్టం చేసింది. ఆమె ప్రస్తుతం ఎలాంటి సీరియల్‌ను ప్రకటించలేదు.